”నేను స్టూడెంట్ సార్!’ నవంబర్ 12న టీజర్ విడుదల

Must Read

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ”నేను స్టూడెంట్ సార్!’. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా ప్రధాన పాత్రలందరినీ పరిచయం చేసిన మేకర్స్, తాజాగా ఓ ఫన్నీ వీడియో ద్వారా సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.ఈ వీడియోలో గణేష్‌ని  ”నేను స్టూడెంట్ సార్!’ టీజర్ గురించి వేర్వేరు వ్యక్తులు అడగడం, ఫైనల్ అతను టీజర్ తేదీని రివిల్ చేయడం ఆసక్తికరంగా వుంది. నేను స్టూడెంట్ సార్!

టీజర్ నవంబర్ 12న విడుదలౌతుంది. పోస్టర్‌లో గణేష్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే గణేష్‌పై ఎటాక్ చేసేందుకు బస్‌లు చుట్టుముట్టడం గమనించవచ్చు.ఈ చిత్రంతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో  వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News