‘నేనే సరోజ ‘ ఉరఫ్ కారంచాయ్ చిత్రం టీజర్ లాంచ్

శాసన సభ్యులు శ్రీ ముఠా గోపాల్ చేతుల మీదుగా ‘నేనే సరోజ ‘ ఉరఫ్ కారంచాయ్ చిత్రం టీజర్ లాంచ్

సినిమా అంటే వినోదాత్మకంగానే కాదు ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలన్న ఆలోచనతో , గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా రచయిత డా. సదానంద్ శారద S-3 క్రియేషన్స్ పతాకంపై శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం ‘నేనే సరోజ ‘ఉరఫ్ కారంచాయ్ . శాన్వి మేఘన, కౌశిక్ బాబు జంటగా నటించారు. ఈ చిత్రం టీజర్ శాసన సభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రచయిత,నిర్మాత డా.సదానంద్ శారద‌, దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి, సంగీత దర్శకులు రమేశ్ ముక్కెర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు శ్రీ ముఠా గోపాల్ మాట్లాడుతూ ” సామాజిక అంశాన్ని తీసుకొని సినిమా నిర్మించిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నా.. ఆడపిల్లను ఒక చైతన్య మూర్తిగా ..ప్రతిభావంతంగా టీజర్ లో చూపించారు. ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్ధిని పాత్ర లో శాన్వి మేఘన పవర్ ఫుల్ గా నటించింది..టీజర్, టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం విజయవంతమవ్వాలని కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్న ” అన్నారు.


దర్శకులు శ్రీ మాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ.. ” ఆడపిల్లల మీద దాడి చేసే ఉన్మాదులకు. .వివక్షత చూపేవారికి ‘ తాగిస్తం కారంచాయ్ ‘ అంటూ గుణపాఠం చెబుతుంది ఈ చిత్రం లో హీరోయిన్ సరోజ. మంచి కంటెంట్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా , కుటుంబ సమేతంగా చూసే చిత్రం ఇదిఅన్నారు. రచయిత,నిర్మాత డా సదానంద్ శారద మాట్లాడుతూ.."వరంగల్ కోట వంటి ఆహ్లాదకరమైన చారిత్రక ప్రదేశాలు..హృద్యమైన సంగీతం.. ఆలోచనాత్మక సంభాషణలు..శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు..ఆర్. యస్. నంద హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల సెన్సార్ పూర్తయి 'U ' సర్టిఫికెట్ పొందిన మా చిత్రం టీజర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago