సౌండ్ పార్టీ  ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్

ట్రెండింగ్ లో  సౌండ్ పార్టీ  ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్!!
                            వైర‌ల్ అవుతోన్న సౌండ్ పార్టీ ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్!!

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం సౌండ్ పార్టీ.  వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టిస్తున్నారు.   రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్ ఇప్ప‌టికే  విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేసింది. ఇక ఇటీవ‌ల ఈ చిత్రం నుండి మ‌ని మ‌ని మ‌ని మ‌నీ దీని ముఖ‌ములు సోమెనీ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు. ప్ర‌జంట్ ఈ సాంగ్ యూట్యూబ్ లో  వైర‌ల్ అవుతోంది. డ‌బ్బు ప్రాధాన్య‌త  గురించి యువ ర‌చ‌యిత పూర్ణ‌చారి ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే విధంగా పాట రాయ‌గా మోహిత్ రెహ‌మానిక్  దానికి త‌గ్గ‌ట్టుగా మాంచి బీట్ తో కంపోజ్ చేశారు. యూట్యూబ్ లో వైర‌ల్   అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్ తో రీల్స్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఫ‌స్ట్ లిరిక‌ల్ తోనే మంచి బ‌జ్ క్రియేట్ చేసిన సౌండ్ పార్టీ చిత్రం ఇటు ఇండ‌స్ట్రీలో అటు ఆడియ‌న్స్ లో రీ -సౌండ్ సృష్టించ‌డం ఖాయం అన‌డంలో సందేహం లేదు. శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో  విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.


 ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ…ఎప్పుడైతే మా `సౌండ్ పార్టీ` చిత్రం  టీజ‌ర్ విడుద‌లైందో అప్ప‌టి నుంచి మా `సౌండ్ పార్టీ` చిత్రానికి మంచి మంచి బ‌జ్ వ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్ లో వీజే స‌న్నీ, శివ‌న్నారాయ‌ణ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమ‌ర్ ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన‌ `సౌండ్ పార్టీ` టైటిల్ ట్రాక్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం పాటలు సినిమాకు ఎంత ప్ల‌స్ అవుతున్నాయో, సినిమాను ప‌బ్లిక్ లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాయో చూస్తున్నాం. ఈ త‌రుణంలో మా సినిమా నుండి రిలీజైన ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ కి  మంచి రెస్పాన్స్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేయ‌నున్నాం. మా సంగీత ద‌ర్శ‌కుడు మోహిత్ రెహ‌మానిక్ అద్భుత‌మైన పాట‌ల‌తో పాటు సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారు. అలాగే స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ , ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం అన్నారు.

  శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

17 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

17 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

18 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

18 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

18 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

23 hours ago