‘డెవిల్’ గ్లింప్స్.. చీక‌టి ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ను ప‌రిచ‌యం చేసిన మేకర్స్

Must Read

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రిలీజైన ‘డెవిల్’ గ్లింప్స్.. చీక‌టి ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ను ప‌రిచ‌యం చేసిన మేకర్స్

Devil - The British Secret Agent Glimpse | Nandamuri Kalyan Ram | Samyuktha Menon | Abhishek Nama

నందమూరి కళ్యాణ్ రామ్.. కెరీర్ ప్రారంభం నుంచి యూనిక్ స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకుంటూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న వెర్స‌టైల్ స్టార్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన మ‌రో వైవిధ్య‌మైన చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. మూవీ టైటిల్ వినగానే హీరోలోని ఉగ్రరూపాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంది.

ఇటీవ‌ల ‘డెవిల్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైన‌ప్పుడు అంద‌రిలోనూ సినిమాపై తెలియ‌ని క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అందుకు కార‌ణం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌ట‌మే. తాజాగా చిత్ర నిర్మాత‌లు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘డెవిల్’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే చాలా గ్రిప్పింగ్‌, థ్రిల్లింగ్‌గా ఆక‌ట్టుకుంటోంది.

‘డెవిల్’ అనే క్రూర‌మైన, తెలివైన సీక్రెట్ ఏజెంట్‌ను ఈ గ్లింప్స్ ద్వారా ఆడియెన్స్‌కు ప‌రిచ‌యం చేశారు. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం ‘డెవిల్’ అనే బ్రిటీష్ ఏజెంట్ ఉండేవాడు.’’ అని గ్లింప్స్‌లో రాగానే క‌ళ్యాణ్ రామ్ క‌నిపిస్తూ మంచి ఏజెంట్ ఎలా ఉండాల‌నే డైలాగ్‌ను వినిపించారు.

సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒదిగిపోయారు. అందుక‌నే గ్లింప్స్ చూడ‌గానే మ‌న‌కు న‌టుడి కంటే పాత్ర క‌నెక్టింగ్ అవుతుంది. నిర్మాణ విలువ‌లు హై స్టాండ‌ర్డ్స్‌లో క‌నిపిస్తున్నాయి. ఇక విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని ఎలివేట్ చేస్తున్నాయి. అలాగే ఈ గ్లింప్స్‌లో బ్యూటీఫుల్ హీరోయిన్ సంయుక్తా మీన‌న‌న్ కూడా క‌నిపించింది. డెవిల్ చేసే యాక్ష‌న్‌, రొమాన్స్‌, ర‌హ‌స్యాన్ని ఛేదించ‌టానికి త‌ను వెళ్లే మార్గం మ‌న అంచ‌నాల‌ను పెంచుతాయి.

అభిషేక్ పిక్చర్స్ దర్శకత్వ పర్యవేక్షణలో దేవాన్ష్ నామాస‌మ‌ర్ప‌కుడిగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియేసింది.

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సంయుక్తా మీన‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌: దేవాన్ష్ నామా
బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
నిర్మాత‌: అభిషేక్ నామా
దర్శకత్వ పర్యవేక్షణ: అభిషేక్ పిక్చర్స్
ద‌ర్శ‌క‌త్వం: న‌వీన్ మేడారం
సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News