నాగశౌర్య కథానాయకుడిగా‘రంగబలి’

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య విభ్నమైన జానర్స్ తో అలరిస్తున్నారు. నాగశౌర్య కథానాయకుడిగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కు

 ‘రంగబలి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈరోజు ఉగాది సందర్భంగా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘రంగబలి’ అనే టైటిల్ చాలా ఇంట్రస్టింగా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఫన్ రైడ్‌ గా ఈ సినిమా వుండబోతోందని అనౌన్స్ మెంట్ వీడియోని చూస్తే అర్ధమౌతోంది.

ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ అయ్యారు. విలక్షణమైన కాన్సెప్ట్‌ లతో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ సుధాకర్ చెరుకూరి అత్యంత గ్రాండ్‌ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సినిమా కోసం పని చేస్తున్న మొత్తం టీమ్ సొంత ఊర్లు పేర్లు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో ప్రస్తావించడం ఆసక్తికరంగా వుంది.

ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీత దర్శకుడు. ఎడిటర్‌ గా కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌ పని చేస్తున్నారు. .

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది . ప్రమోషన్లను ప్రారంభించడానికి మేకర్స్ ఉగాది పర్వదినాన్ని ఎంచుకున్నారు.

తారాగణం: నాగ శౌర్య

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: ఎస్ఎల్వీ  సినిమాస్

సంగీతం: పవన్ సిహెచ్

డీవోపీ: దివాకర్ మణి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago