అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, నంబర్ 2 లాంచ్ఉగాదికి ప్రారంభం

అల్లరి నరేష్ తన జనరేషన్ హీరోలలో కామెడీ కింగ్. అయితే ఇటీవలి కాలంలో భిన్నమైన పంథాను అనుసరించి తాను కామెడీతో పాటు ఇంటెన్స్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా అభిమానులకు శుభవార్త అందించారు. అల్లరి నరేష్ చేయబోతున్న  ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా చిలకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 2గా రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. 

జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నరేష్ , ఫారియాల కలయికలో వస్తున్న మొదటి సినిమా ఇది. కథలో యూనిక్ పాయింట్ తో పాటు కంప్లీట్  ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ హిలేరియస్  రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.

తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడంతో పాటు మేకర్స్ ఈరోజు గ్రాండ్ గా  ప్రారంభ వేడుకను కూడా నిర్వహించారు. 

ఈ కార్యక్రమం లో యంగ్ డైరెక్టర్ / యాక్టర్ తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా..ఫస్ట్ షాట్ డైరెక్షన్ నాగ్ అశ్విన్ చేశారు..జెమినీ కిరణ్ మరియు శరత్ మరార్ స్క్రిప్ట్ అందజేశారు.       

చిత్ర ప్రారంభోత్సవంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఇది చాలా మంచి కామెడీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు నా నుంచి  కోరుకునే ఫన్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా అన్నీ ఇందులో వుంటాయి.  ఏప్రిల్ 10 నుంచి షెడ్యుల్ స్టార్ట్ అవుతుంది. అన్నారు

ఫారియా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిని కొత్త సినిమాతో మొదలుపెడుతున్నందుకు ఆనందంగా వుంది. చిలకా ప్రొడక్షన్స్ కి కృతజ్ఞతలు. నరేష్ గారి తో పని చేయడం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. సినిమా అదిరిపోతుందనే నమ్మకం వుంది’’

నిర్మాత మాట్లాడుతూ.. దర్శకుడు మల్లి గారు నాకు పదేళ్ళుగా తెలుసు. ఆయనతో సినిమా చేస్తానని పదేళ్ళ క్రితమే చెప్పాను. ఈ కథ చెప్పినపుడు  ఈ కథకు నరేష్ గారు మాత్రమే న్యాయం చేయగలరనిపించింది. నరేష్ గారితో సినిమా చేయడం ఆనందంగా వుంది.  ఫారియాతో పాటు యూనిట్ అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

దర్శకుడు మల్లి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నరేష్ గారికి, ఫారియా గారికి కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. రవిగారు నా కథని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అందరూ గర్వపడే సినిమా చేస్తాననే నమ్మకం వుంది’’ అన్నారు

అబ్బూరి రవి మాట్లాడుతూ.. నరేష్ గారితో ఇది నాకు నాలుగో సినిమా. చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీ అందరికీ నచ్చేలా సినిమా తీయడానికి ప్రయత్నిస్తాం’ అన్నారు. 

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు అబ్బూరి రవి డైలాగ్స్ రాయగా, గోపీ సుందర్  సంగీతం అందిస్తున్నారు. సూర్య  డీవోపీ గా,  ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. భరత్ లక్ష్మీపతి, సురేష్ లడ్డునూరి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. ఆర్ట్ డైరెక్టర్ జెకె మూర్తి.

ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక 20 సంవత్సరాలకు పైగా యానిమేషన్ & మీడియా పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నారు. ఇప్పుడు కొత్త బ్యానర్ “చిలక ప్రొడక్షన్స్”తో లైవ్ యాక్షన్ మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టారు.

సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా

సాంకేతిక  విభాగం:

కథ, స్క్రీన్ప్లే & దర్శకత్వం: మల్లి అంకం

నిర్మాత: రాజీవ్ చిలక

బ్యానర్: చిలక ప్రొడక్షన్స్

డైలాగ్స్: అబ్బూరి రవి

సంగీతం: గోపీ సుందర్

డీవోపీ: సూర్య

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్: జెకె మూర్తి

సహ నిర్మాతలు: భరత్ లక్ష్మీపతి,  సురేష్ లడ్డునూరి

సాహిత్యం; రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: అక్షిత అక్కి

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

9 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago