సత్య ఆర్ట్స్‌ పతాకంపై ‘మెగా పవర్‌’ చిత్రం ప్రారంభం!

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ఆశీసులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా ‘మెగా పవర్‌’ చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్‌ ఇచ్చారు. ికిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పృథ్వీరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.

హీరో మాట్లాడుతూ ‘‘హీరోగా తొలి చిత్రమిది. లైన్‌ బావుంది. కథ మీద బాగా వర్క్‌ చేశాం. నా మీద నమ్మకంతో మా బాబాయ్‌ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌ టీమ్‌ చేస్తున్నాం.  వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తాం. ఇతర  వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు.

హీరోయిన్‌ శశి మాట్లాడుతూ ‘‘తెలుగులో తొలి చిత్రమిది. హీరోయిన్‌ పరిచయానికి చక్కని కథ ఇది.

దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారి ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై తొలి చిత్రం ప్రారంభమైంది. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. యాక్షన్‌ సీన్స్‌ కోసం తగిన జాగ్రత్తలతో హీరో శిక్షణ పొందారు. త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్‌ చేస్తాం. అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. అలాగే పండుగ బిజీలో ఉంది కూడా మా సినిమా ప్రారంభానికి వచ్చిన కిరణ్ అబ్బవరం, రఘుబాబు, పృథ్వీ గార్లకు థాంక్స్ ’’ అని అన్నారు.
పృథ్వీ, రఘుబాబు, మురళీశర్మ, రచ్చ రవి, రియాజ్‌, రెహమాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సురేష్‌, సంగీత, ప్రభావతి వర్మ, కౌశల్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి…

డిఓపి: శ్రీకాంత్‌ గేదెల,
కొరియోగ్రాఫర్‌ఫ శిరీష్‌ గేదెల
ఆర్ట్‌: విఠల్‌ కోసనం
సంగీతం: మ్యాడీ
ఎడిటర్‌: మార్తండ్‌ కె. వెంకటేశ్‌
స్టంట్‌ మాస్టర్‌: టి. రవిరాజు
స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌: కృష్ణ
పీఆర్వో : మధు విఆర్
మాటలు: రావణ్‌ తోట
నిర్మాతలు: అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల,
కథ – స్ర్కీన్‌ప్లే – దర్శకత్వం: రవిచంద్ర గేదెల 

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago