యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ రోజు రుద్రుడు నుంచి భగ భగ రగలరా పాటని విడుదల చేశారు.
జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని రుద్రుడు టైటిల్, పాత్రకు జస్టిఫికేషన్ గా చాలా పవర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్రుడిగా లారెన్స్ ప్రజన్స్ పూనకాలు తెప్పించగా.. పృధ్వీ చంద్ర ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు.
లారెన్స్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది.
ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథోనీ, స్టంట్స్ శివ-విక్కీ.
రుద్రుడు ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం – కతిరేశన్
నిర్మాత- కతిరేశన్
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ డి రాజశేఖర్ ISC
ఎడిటర్: ఆంథోనీ
స్టంట్స్: శివ – విక్కీ
పీఆర్వో –వంశీ శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…