‘మోతెవరి లవ్ స్టోరీ’ సకుటుంబ సమేతంగా హాయిగా అందరూ నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది.. మెగా ప్రివ్యూ ఈవెంట్‌లో హీరో అనిల్ గీలా

Must Read

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్‌ రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌‌‌ ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు మెగా ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరీస్‌లోని మొదటి నాలుగు ఎపిసోడ్‌లను ప్రత్యేక ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

కందకట్ల సిద్దు మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ టీంకు కంగ్రాట్స్. ఇది సిరీస్‌‌లా కాకుండా సినిమాలా అనిపించింది. డీఓపీ పేరులో అరుపుల అని ఉంది. విజువల్స్ చూస్తే అరుపులే. చరణ్ అర్జున్ గారి పాటలు, బీజీఎం అద్భుతంగా అనిపించాయి. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను గుర్తించి ప్రయత్నిస్తే ఇలాంటి సక్సెస్ వస్తుంది. ఫోన్ నుంచి జర్నీ స్టార్ చేసిన మై విలేజ్ షో టీం ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. అనిల్, వర్షిణి, మాన్సీ ఇలా అందరూ చక్కగా నటించారు. ‘బలగం’ రేంజ్‌లో ‘మోతెవరి లవ్ స్టోరీ’ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ టీం చాలా కష్టపడింది. ఇలాంటి కథలను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి ZEE5 టీం చాలా కష్టపడుతోంది. అనిల్, వర్షిణి అద్భుతంగా నటించారు. శివ ఇప్పటికీ సిరీస్‌ కోసం పని చేస్తూనే ఉన్నారు. సదన్నకు నేను పెద్ద అభిమానిని. చరణ్ అర్జున్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. మా జర్నీని ఒకేసారి ప్రారంభించాం. స్నేహగీతం చిత్రంలో ఆయన ఓ పాట రాశారు. ఇందులో మంచి మ్యూజిక్, పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. శ్రీకాంత్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

అనిల్ గీలా మాట్లాడుతూ .. ‘మా జర్నీ 8 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ స్థాయికి వస్తామని నేను అయితే అనుకోలేదు. శ్రీకాంత్ అన్న చెప్పినట్టుగా వచ్చే పదేళ్లలో ఆ స్థాయిలో ఉంటాం. తెరపై మా బొమ్మని చూసుకుంటే ఆనందంగా ఉంది. అందరం ప్రేమతో ఈ ప్రాజెక్ట్‌ని చేశాం. తీసుకున్న బడ్జెట్‌కి ఇచ్చిన అవుట్ పుట్‌కు ZEE5 టీం సంతృప్తికరంగా ఉంది. మేం కన్న కలకు అందరం ఆయుధంగానే పని చేశాం. శివన్న ప్రతీ చిన్న డీటైల్‌ను మిస్ కాకుండా చూసుకునేవారు. మా అందరికీ ఇది మొదటి ప్రాజెక్ట్. మా శివన్నతో సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తాం. మా ‘మై విలేజ్ షో’ టీంను మరింత ముందుకి తీసుకెళ్తాం. శ్రీకాంత్, శివన్న, నేను ముగ్గురం త్రిమూర్తుల్లా పని చేశాం. ఎక్కడా క్వాలిటీ తగ్గొద్దు అని శ్రీకాంత్ అన్న చాలా కష్టపడ్డారు. చరణ్ అన్న తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఆయన ఆర్ఆర్ వల్లే చాలా మంది ఏడ్చేశారు. హరి ప్రియ క్యాస్టూమ్స్ అద్భుతంగా కుదిరాయి. మా కోసం లాంగ్ డ్రైవ్ సంస్థ కార్లను ఉచితంగా ఇచ్చింది. మమ్మల్ని ముందుండి నడిపించిన మధుర శ్రీధర్ అన్నకి థాంక్స్. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నా భార్య ఆమనికి థాంక్స్. మా లాంటి కొత్త వారికి మీడియా సపోర్ట్ ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సకుటుంబ సమేతంగా అందరూ కూర్చుని హాయిగా చూసుకునేలా మా సిరీస్ ఉంటుంది. ఆగస్ట్ 8న మా సిరీస్ ZEE5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

చరణ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’తో అనిల్, శివన్న, సదన్న, రాజన్న ఇలా అందరూ హీరోలు అవుతున్నారు. శ్రీధర్ గారు నాకు మెంటర్‌లాంటి వారు. స్టైల్ చిత్రంలో మెరుపై సాగరా అనే పాటను రాశాను. ఆ పాట బయటకు రాయడానికి మధుర శ్రీధర్ గారే కారణం. ఆ పాటను ఆయనెంతో మెచ్చుకున్నారు. ఆయన మట్టి కళకారుల్ని బయటకు తీసుకు వస్తుంటారు. ZEE5 టీంతో ‘విమానం’ సినిమాను చూశాను. గెలుపు కోసం పోరాడే వీరులకు ఆయుధంగా ఉండాలని ఈ సిరీస్‌లోకి వచ్చాను. అనిల్, వర్షిణి జంట అందరినీ ఆకట్టుకుంది. శ్రీకాంత్ విజువల్స్, నా పాట ఇన్నాళ్లకు సెట్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’

శ్రీకాంత్ అరుపుల మాట్లాడుతూ .. ‘పగలు రాత్రి తేడా లేకుండా ఈ సిరీస్‌ కోసం అందరం పని చేశాం. అనిల్, శివ, నేను గత వారం నుంచి నిద్ర కూడా పోవడం లేదు. ఈ స్టోరీతో మేమంతా కనెక్ట్ అయిపోయాం. ఎలాగైనా సరే విజయం సాధించాలని కసితో పని చేశాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్ గారికి, ZEE5 టీంకు థాంక్స్. మా సిరీస్‌ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చరణ్ అర్జున్ అన్న ఇచ్చిన పాటలు, ఆర్ఆర్‌కు కంటతడి వచ్చేసింది. మా అనిల్ ఇంకా పెద్ద హీరో అవుతాడు’ అని అన్నారు.

ZEE5 తెలుగు కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయి తేజ్ మాట్లాడుతూ .. ‘ప్రతీ ఊర్లో ఓ మోతెవరి ఉంటాడు. మారుమూల గ్రామాలకు సంబంధించిన కథలు చెప్పాలని అనుకున్నాం. తెలంగాణకు సంబంధించి రూటెడ్‌ కథ చెప్పాలని అనుకున్నప్పుడు అనిల్ గీలా గుర్తుకు వచ్చారు. అనిల్, శివ చెప్పిన కథ చాలా కనెక్ట్ అయింది. ప్రతీ నెలా ఇలాంటి కొత్త కథలతోనే మా ZEE5 టీం రాబోతోంది. శివ అద్భుతంగా సిరీస్‌ను రూపొందించారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ చాలా గొప్పగా ఉంది. శ్రీధర్ గారు మా వెన్నంటే ఉండి నడిపించారు. అందరూ ZEE5 సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ సిరీస్‌ను చూడండి’ అని అన్నారు.

శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ .. ‘మేం ముందుగా ఈ సిరీస్‌ను సొంతంగా చేయాలని అనుకున్నాం. ఆ టైంలో మధుర శ్రీధర్ గారు మాకు సపోర్ట్ ఇచ్చారు. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. ZEE5 టీం సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. చరణ్ అన్న మంచి మ్యూజిక్ ఇచ్చారు. ముందు ముందు మై విలేష్ షో టీం నుంచి ప్రపంచ స్థాయి చిత్రాలు వస్తాయ’ని అన్నారు.

వర్షిణి మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శివన్నకు థాంక్స్. మా అందరినీ బాగా చూపించిన శ్రీకాంత్ అన్నకి థాంక్స్. అనిల్‌తో సరదాగా షూటింగ్ చేశాను. ఆగస్ట్ 8న మా సిరీస్ ZEE5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నటుడు సదన్న మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి మంచి పాత్రను ఇచ్చిన శివ, అనిల్‌కు థాంక్స్. మధుర శ్రీధర్, శ్రీకాంత్, ZEE5 టీంకు థాంక్స్. ఈ సిరీస్ మరింతగా సక్సెస్ అవ్వాలని, అందరినీ మరింతగా ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటి మాన్సీ మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’లో అవకాశం ఇచ్చిన శివ అన్నకి థాంక్స్. ఎక్కడా కూడా గ్లిజరన్ వాడుకుండా నటించాం. నా కుక్క చచ్చిపోయిందని చెప్పి నాతో ఎమోషనల్ సీన్స్ చేయించారు. ఆ తరువాత సీన్లన్నీ కూడా ఏడుస్తూనే చేశా. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

నటుడు రాజు మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శివన్నకి, అనిల్ అన్నకి, ZEE5 టీంకు థాంక్స్. ఇకపై ZEE5 టీంతో సినిమాలు చేస్తూనే ఉంటామ’ని అన్నారు.

నటుడు రవి చంద్ర మాట్లాడుతూ .. ‘శివ, అనిల్, శ్రీకాంత్ ఇలా అందరూ అద్భుతం చేశారు. చరణ్ అర్జున్ సంగీతం గొప్పగా అనిపించింది. అనిల్ ఇంకా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. ‘మోతెవరి లవ్ స్టోరీ’ టీంకు సహకరించిన మధుర శ్రీధర్, ZEE5 టీంకు థాంక్స్’ అని అన్నారు.

లిరిసిస్ట్ మల్లెగోడ గంగా ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ నాకు అవకాశం ఇచ్చిన శివన్న, అనిల్ అన్నకు థాంక్స్. గంగడోలు పాటను చరణ్ అన్నకి చెప్పేందుకు చాలా భయపడ్డాను. ఆ పాటను కంపోజ్ చేస్తున్నప్పుడే అందరం ఏడ్చేశాం. క్లైమాక్స్‌లో అనిల్ అన్న యాక్టింగ్‌కి మ్యూజిక్ మాత్రమే సరిపోదు పాట కావాలని చివరి నిమిషంలో చెబితే కేవలం 18 నిమిషాల్లోనే పూర్తి చేశామ’ని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News