ఆద్యంతం ఆకట్టుకునేలా ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ ట్రైలర్.. ఆగ‌స్ట్ 22న మూవీ గ్రాండ్ రిలీజ్‌

Must Read

రాజు జెయ‌మోహ‌న్‌, ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘ‌వ్ మిర్‌ద‌త్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ స‌మ‌ర్ప‌కుడిగా రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ నిర్మించిన ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ ఔట్ అండ్ ఔట్ కామెడీగా తమిళ్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 22న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పైన సిహెచ్ సతీష్ కుమార్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Bun Butter Jam (Telugu) - Official Trailer | Raju | Raghav Mirdath | Nivas K Prasanna

‘సంపాదించిన దాంట్లో సగం పెళ్లికి ఖర్చు పెడుతున్నారు.. మిగతా సగం డైవర్స్‌కి ఖర్చు పెడుతున్నారు’, ‘అసలు నేను చేస్తోంది లవ్వో కాదో తెలియట్లేదే’, ‘ఏ రిలేషన్ షిప్‌లో అయినా రెండు వైపుల ప్రేమ, మర్యాద సమానంగా ఉండాలి’.. ‘మీరు రాను రాను పిచ్చి వాళ్లలా బిహేవ్ చేస్తున్నారు’.. ‘అవునురా మేమంతా పిచ్చివాళ్లమే.. మీ లైఫ్ అంతా బాగుండాలని అనుకుంటున్నాం కదా’ అని తల్లీకొడుకుల మధ్య సంభాషణ.. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే డైవర్స్ తీసుకుంటున్నారు.. మీ జనరేషన్‌‌ను అర్థం చేసుకునే ప్రయత్నం ఓడిపోతున్నాం’ అంటూ తల్లి చెప్పే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉండబోతోన్నాయో అర్థం అవుతోంది.

కాలేజ్ లైఫ్, ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రుల ప్రేమ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా అర్థం అవుతోంది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది యూత్ ఫుల్, లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ సినిమా అని తెలుస్తోంది. రాఘ‌వ్ మిర్‌ద‌త్ ఫ‌న్నీగా సినిమాను తెర‌కెక్కించిన తీరు, నివాస్ కె.ప్ర‌సన్న సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్ర‌ఫీతో పాటు ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ఆగ‌స్ట్ 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తెలుగులో విఘ్నేశ్వ‌ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.హెచ్‌.స‌తీష్ కుమార్ విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:

రాజు జెయ‌మోహ‌న్‌, ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ‌, చార్లి, శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్‌, దేవ‌ద‌ర్శిన‌, మైకేల్ తంగ‌దురై, విజె.ప‌ప్పు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వ్ మిర్‌ద‌త్‌, నిర్మాత‌లు: రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్‌, సంగీతం: నివాస్ కె.ప్ర‌స‌న్న‌, సినిమాటోగ్ర‌ఫీ: బాబు కుమార్‌, ఎడిట‌ర్: జాన్ అబ్ర‌హం, వి.ఎఫ్‌.ఎక్స్ ప్రొడ్యూస‌ర్‌: స్టాలిన్ శ‌ర‌వ‌ణ‌న్‌, ఆర్ట్‌: శ‌శికుమార్, ప్రాజెక్ట్ డిజైన‌ర్‌: స‌తీష్ కె, కొరియోగ్ర‌ఫీ: బాబి, స్టంట్‌: ఓం ప్ర‌కాష్‌, సౌండ్ డిజైన్‌: సింక్ సినిమా, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ఎం.జె.భార‌తి, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర‌కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News