మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.పి మహేష్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందించింది. ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నువిడుదల చేశారు.

రధన్ సంగీత అందించిన ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రాయగా.. ఎమ్ఎమ్ మానసి ఆలపించారు.  ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ.. పెద్ద అడుగే వేసిందే.. పద్ధతులన్నీ సంకెళలంటూ తెంచుకుంటూ నడిచిందే.. సన్నాయే వద్దంటా.. మంత్రాలొద్దంటా..పేరంటాలే పడదంటా..’ అంటూ సాగే ఈ గీతం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను తెలియజేసేలా ఉంది. స్నేహం, మోహం, బంధం, అనుబంధం ఏవీ వద్దనుకునేలాంటి పాత్రలో అనుష్కశెట్టి నటిస్తోందని ఈ పాట చూస్తే అర్థం అవుతోంది. అటు రధన్ అందించిన ట్యూన్ కూడా చాలా క్యాచీగా వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఆ ట్యూన్ అంతే అందంగా పాడింది ఎమ్ఎమ్ మానసి. పాటను బట్టి చూస్తే హీరోయిన్ పై సాగే మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది.
ఇక ఈ వేసవి బరిలో తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ పాట ఓ కొత్త ఊపుతో మొదలుపెట్టింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతున్నారు. భాగమతి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యూవీ క్రియేషన్స్ లో అనుష్క శెట్టి నటించిన సినిమాగానూ.. స్వీటీ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక ఓ మంచి పాటతో మెప్పించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలోని ఈ గీతాన్ని కంపోజ్ చేసింది  : రధన్, లిరిక్స్ : అనంత శ్రీరామ్, సింగర్ : ఎమ్ఎమ్ మానసి, ర్యాప్ పర్ఫార్మెన్స్  : లేడీ కాష్.
బ్యానర్ : యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్ : రాజవీన్,
విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : రాఘవ్ తమ్మారెడ్డి
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
పిఆర్వో : జీఎస్కే మీడియా
నిర్మాతలు : వంశీ – ప్రమోద్ – విక్రమ్
రచన, దర్శకత్వం : పి. మహేష్ కుమార్.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago