గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలసి #NBK108 తో మాసెస్, అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్, అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి అందరికి మాస్ ఫీస్ట్ అందించారు మేకర్స్. బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను విడుదల చేశారు. మొదటి పోస్టర్ లో సాంప్రదాయ దుస్తులు ధరించి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు బాలకృష్ణ. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించడం ఆసక్తికరంగా వుంది. బాలకృష్ణ చేతిపై టాటూ కూడా ఉంది. రెండు పోస్టర్లలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని గెటప్ లలో కనిపిస్తున్నారు.
మరో పోస్టర్ గడ్డం, హ్యాండిల్ బార్ మీసాలతో అగ్రెసివ్ అవతార్ లో ప్రజంట్ చేసింది. బాలకృష్ణ వెనుక ఉదయించే సూర్యుడిని చూడవచ్చు. ఈ పోస్టర్ లో చాలా యంగర్ గా కనిపిస్తున్నారు. రెండు పోస్టర్లు మాస్ ని ఆకట్టుకొని చాలా క్యూరియాసిటీని పెంచాయి. ‘’This time beyond your imagination’ అనే ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని కలిగించింది.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.
#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ #NBK108కి సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా వుంది.
సి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. వి వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…