విక్టరీ వెంకటేష్,‘సైంధవ్’ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఉగాదిని పురస్కరించుకొని మేకర్స్ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌ లో కనిపించారు. తుపాకీ పట్టుకుని ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు.

సైంధవ్ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ  మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

ఇతర నటీనటులను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

 తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం : శైలేష్ కొలను

నిర్మాత: వెంకట్ బోయనపల్లి

బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్

సంగీతం: సంతోష్ నారాయణ్

సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు

డీవోపీ: ఎస్.మణికందన్

ఎడిటర్: గ్యారీ బిహెచ్

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)

పీఆర్వో : వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను

మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్

డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago