మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవర గ్లింప్స్, ఫియర్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
మ్యూజికల్ ప్రమోషన్‌లను కొనసాగిస్తూ ఈ చిత్రం నుంచి రెండో పాటను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మేరకు ఇచ్చిన అప్డేట్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దేవర పూర్తి రొమాంటిక్ మోడ్‌లో మారినట్టుగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ మెలోడీకి ‘పఠాన్’,’వార్’,’ఫైటర్’ వంటి చిత్రాలలో వైరల్ స్టెప్పులకు పేరుగాంచిన బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ మ్యాజికల్ మెలోడీ కోసం అభిమానులెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్ అసాధారణమైన స్టెప్పులతో ఈ పాట అందరినీ ఆకట్టుకోనుంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…