భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా … ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది.
చిట్టి పొట్టి టైటిల్ , మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, అలాగే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్ లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.
ఈ సినిమా నుండి చిట్టి పొట్టి సాంగ్ ను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”సాంగ్ బాగుంది, ప్రతి అన్నా చెల్లి కి ఈ పాట కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్… శ్రీ వెంకట్ మంచి ట్యూన్ ఇచ్చారు, దర్శక..నిర్మాత…భాస్కర్ యాదవ్ దాసరి గారికి చిట్టి పొట్టి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.
నటీనటులు:
రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి
సంగీతం: శ్రీ వెంకట్
కొరియోగ్రాఫర్: కపిల్ మాస్టర్ ఎడిటర్: బాలకృష్ణ బోయ
కెమెరా: మల్హర్బట్ జోషి
పి.ఆర్.ఓ: లక్ష్మి నివాస్
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…
ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…