మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవర గ్లింప్స్, ఫియర్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
మ్యూజికల్ ప్రమోషన్లను కొనసాగిస్తూ ఈ చిత్రం నుంచి రెండో పాటను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మేరకు ఇచ్చిన అప్డేట్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దేవర పూర్తి రొమాంటిక్ మోడ్‌లో మారినట్టుగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ మెలోడీకి ‘పఠాన్’,’వార్’,’ఫైటర్’ వంటి చిత్రాలలో వైరల్ స్టెప్పులకు పేరుగాంచిన బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ మ్యాజికల్ మెలోడీ కోసం అభిమానులెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్ అసాధారణమైన స్టెప్పులతో ఈ పాట అందరినీ ఆకట్టుకోనుంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి…
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…