“బడ్డీ” థియేటర్ లోనే ఎంజాయ్ చేయాల్సిన సినిమా – డైరెక్టర్ శామ్ ఆంటోన్

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించగా..శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “బడ్డీ” రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో “బడ్డీ”కి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేసుకున్నారు డైరెక్టర్ శామ్ ఆంటోన్.

  • “బడ్డీ” మూవీకి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని, తమకు నచ్చిందని పిల్లలు, పెద్దలు చెబుతుండటం సంతోషంగా ఉంది. మార్నింగ్ షోస్ నుంచే సినిమా హిట్ అనే మౌత్ టాక్ మొదలైంది. “బడ్డీ” మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడం మా టీమ్ అందరికీ హ్యాపీగా ఉంది. “బడ్డీ”లోని కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో పాటు టెడ్డీ బేర్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తోంది.
  • మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారితో రెండేళ్ల క్రితమే “బడ్డీ” గురించి డిస్కషన్ జరిగింది. తమిళ్ మూవీ టెడ్డీని రీమేక్ చేయాలనే ప్రస్తావన వచ్చింది. అయితే టెడ్డీలోని ఒక లైన్ మాత్రమే తీసుకుని కంప్లీట్ గా కొత్త కథతో “బడ్డీ” రూపొందించాలని అనుకున్నాం. అలా ఈ సినిమా మొదలైంది. ఈ మూవీకి ఒక యంగ్ హీరో అయితే బాగుంటుందని అల్లు శిరీష్ ను అప్రోచ్ అయ్యాం. ఆయన నాకు చాలాకాలంగా పరిచయం. నా మూవీస్ చూసి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. మేము సినిమా చేయాలని గతంలోనే అనుకున్నాం. “బడ్డీ” కథ చెప్పగానే శిరీష్ కు నచ్చి ప్రాజెక్ట్ బిగిన్ చేశాం.
  • ఇవాళ ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే మూవీస్ కు మాత్రమే థియేటర్స్ కు వెళ్తున్నారు. “బడ్డీ” థియేటర్ కోసమే చేసిన సినిమా. ఇందులో టెడ్డీకి ఎక్స్ ప్రెషన్స్ తీసుకురావడం మెయిన్ టాస్క్ గా భావించాం. సీజీ వర్క్ బాగా చేయించి ఆ ఫీల్ తీసుకొచ్చాం. యాక్షన్, అడ్వెంచర్ కథలో ఉన్నా.ఇది మెయిన్ గా లవ్ స్టోరీ. ఏటీసీలో వర్క్ చేసే అమ్మాయి, పైలట్ కు మధ్య జరిగే ప్రేమ కథ.
  • “బడ్డీ” కోసం రాజమౌళి ఈగ రిఫరెన్స్ తీసుకున్నా. ఆ సినిమాలో వర్కవుట్ అయిన ఎమోషన్ మనకూ వర్కవుట్ అవుతుందని చెప్పా. అది విలన్ క్యారెక్టర్ అయినా, లవ్ అయినా, టెడ్డీ బేర్ క్యారెక్టర్ అయినా ఎమోషన్ వర్కవుట్ అవుతుందని నమ్మకం ఉండేది. ఖైదీ, విక్రమ్, కల్కిలా ఎపిసోడ్స్ లా “బడ్డీ” సినిమాను చేసుకుంటూ వెళ్లాం. క్లైమాక్స్ లో ఫ్లైట్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హిప్ హాప్ ఆది హీరోగా నెక్ట్ మూవీ చేయబోతున్నా.
  • నాకు తెలుగు మూవీస్ ఇష్టం. రెగ్యులర్ గా తెలుగు మూవీస్ చూస్తుంటా. స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. దర్శకుడిగా ఒక జానర్ కు రెస్ట్రిక్ట్ కాలేను. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరి ఇలా ఏ జానర్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.
Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago