మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ లాంచ్  చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో  రామబ్రహ్మం సుంకర  గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా మాసీవ్ ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. టీజర్‌ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ తో ఆకట్టుకున్న మేకర్స్ ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ తో ముందుకు వచ్చారు.  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

భోళా శంకర్ ట్రైలర్ కోల్‌కతాలోని అందోళనకర పరిస్థితులలో ఆసక్తికరమైన నోట్ తో ప్రారంభమవుతుంది. చాలా మంది యువతులు కిడ్నాప్ అవుతారు. వారి తల్లిదండ్రులు, పోలీసులు భయాందోళనలో వుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కిడ్నాప్‌ల వెనుక ఉన్న సూత్రధారిని పోలీసులు కనుగొనలేకపోతారు. అప్పుడు భోళా శంకర్.. నేరస్థుడిని పట్టుకోవడానికి, అమ్మాయిలను రక్షించడానికి వస్తాడు. సీరియస్‌గా ప్రారంభమైన  కథనం ఒకదాని తర్వాత ఒక  ప్రధాన పాత్రల ప్రవేశంతో వినోదాత్మకంగా మారుతుంది.

చిరంజీవి వింటేజ్  అవతార్‌లో కనిపించి తన మాస్ పవర్‌ను మరోసారి చూపించారు. యాక్షన్‌తో పాటు వినోదాత్మక సన్నివేశాలలో కూడా ఎక్స్ టార్డినరిగా వున్నారు. డిఫరెంట్ సీన్స్ లో రాజశేఖర్, పవన్ కళ్యాణ్‌లను మెగాస్టార్ అనుకరిస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. తమన్నా భాటియా లాయర్‌గా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా , సుశాంత్ ఆమె బాయ్ ఫ్రండ్ గా కనిపించారు.  వెన్నెల కిషోర్ భోళా సీనియర్‌గా కనిపించడం నవ్వులు పూయించింది.

ట్రైలర్ సూచించినట్లుగా భోళా శంకర్ ఒక మెగా-మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు మెహర్ రమేష్. డడ్లీ సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా వుంది. మహతి స్వర సాగర్ తన సలైవ్లీ  స్కోర్‌తో విజువల్స్‌ను  నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు.

అనిల్ సుంకర ఎకె  ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాణ ప్రమాణాలు వున్నత స్థాయిలో వున్నాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.  సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

4 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

4 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

4 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

4 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

4 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

10 hours ago