ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ #D51 అనౌన్స్ మెంట్
ధనుష్ 51వ చిత్రం లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యుటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్-విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేతులు కలపనున్నారు.
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లోని క్రేజీ చిత్రం #D51ని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీర్వాదంతో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ వారి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మల్టీ లాంగ్వేజస్(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) లో భారీ స్థాయిలో రూపొందించనున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ధనుష్ పుట్టినరోజు (జులై 28) సందర్భంగా మేకర్స్ #D51 కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: ధనుష్
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
పీఆర్వో : వంశీ శేఖర్
డిజిటల్ : ఫస్ట్ షో
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…