మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు విశ్వక్సేన్‌


‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై హీరోగా రాకేశ్‌ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేక మేడలు’ చిత్రం టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్‌ టీజర్‌ను విడుదల చేశారు.

విశ్వక్సేన్‌ మాట్లాడుతూ ‘‘రాకేశ్‌ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్‌ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్‌ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్‌ అద్భుతంగా ఉంది. రాకేశ్‌కు ఆల్‌ ద బెస్ట్‌. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఇక చిత్రాల గురించి వస్తే… నా రెండు చిత్రాల గురించి వచ్చేవారం నుంచి అప్‌డేట్స్‌ ఇస్తా. వాటిలోపాటు ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఇస్తాను. ముఖ్యంగా ఈ వేదికగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నాలాంటి వాళ్లు చిన్న హీరో అయినా చేస్తున్న పనిలో బిజీతో కొన్ని సందర్భాల్లో ఎవరికీ టైమ్‌ ఇవ్వలేము. కథలు వినలేము. తెలుగులో ఏ సినిమా హిట్‌ అయినా ఎక్కువశాతం ఆనందించేవాళ్లు ఉంటారు. ఏడ్చేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. ఇటీవల నాపై కొన్ని మీమ్స్‌ వచ్చాయి. కథ చెబుతానంటే టైమ్‌ ఇద్వలేదు.. వినలేదు అని. గంట సేపు ఓ మనిషికి కూర్చోబెట్టి తిరస్కరించడం ఇష్టం లేక నా నోటి నుంచి వచ్చిన జవాబు అది. చిన్న సినిమాగా మొదలన ఆ చిత్రం పెద్ద హిట్‌ అయితే ఆనందించారు. డైరెక్టర్స్‌ గ్రూప్‌లో ఆ చిత్రం ట్రైలర్‌ రాగానే బావుందని మొదటి స్పందించింది నేనే’. ఆ చిత్రం నేను చేయాలి. కానీ కుదరలేదు. మన సినిమా బావుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు. అదొకటి నాకు బాధ అనిపించింది’’ అని అన్నారు.

నిర్మాత రాకేశ్‌ వర్రే మాట్లాడుతూ ‘‘ హీరోగా నేను చేసిన ఎవరికి చెప్పొద్దు’ వచ్చిన మూడేళ్లకు ఈ సినిమా చేశారు అయితే నిర్మాతగా ఈ సినిమా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తాననుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్‌ డైరెక్టర్స్‌ శశికిరణ్‌ తిక్కా, రాహుల్‌ సంక్రిత్యన్‌, తరుణ్‌ భాస్కర్‌లతోపాటు సుకుమార్‌, కొరటాల శివ వంటి దర్శకులు సపోర్ట్‌తో ఆ సినిమా విడుదల చేయగలిగా. మూడు రోజుల్లో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్‌ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ‘స్నేహితుడి ద్వారా ‘పేక మేడలు’ కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమాకు వర్క్‌షాప్‌ చేశాం. ‘ఎవరికీ చెప్పొద్దు’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో స్టాండర్డ్‌గా చేశాం. విష్వక్‌ గెస్ట్‌గా ఎందుకనే ప్రశ్న ఎదురైంది. తన కమిట్‌మెంట్‌ నాకు ఇష్టం. ప్రారంభంలోనే తను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. స్టార్‌ కావాలని అందరూ అనుకుంటారు. ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంతో తనని తానే స్టార్‌ చేసుకున్నాడు. ఎవరు అతన్ని స్టార్‌ని చేయలేదు. విశ్వక్‌తో మొదటి సినిమా చేసిన యాకుబ్‌ ఇప్పుడు నాతో సినిమా చేస్తున్నాడు. విష్వక్‌గా డెడికేటింగ్‌ చేయాలి అని వర్క్‌షాప్‌లో యాకుబ్‌ తరచూ చెబుతుండేవాడు. నేను అదే ఫాలో అయ్యా. ఇప్పుడు నేను పిలవగానే కాదనుకుండా టీజర్‌ రిలీజ్‌కి వచ్చాడు. ఈ చిత్రానికి వినోద్‌, అనూష యాప్ట్‌. వాళ్లిద్దరిమీదే సినిమా నడుస్తుంది. ఉత్తమ ఆర్టిస్ట్‌ కూడా వచ్చేంతగా యాక్ట్‌చేశారు.

దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ ‘‘
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశా. దీక్షితులుగారు మా మాస్టర్‌. యాక్టింగ్‌ స్కూల్‌లో ఉన్నప్పుడే దర్శకత్వంపై ఆసక్తి ఉండేది. అనీస్‌ కురువిళ్లా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. అప్పుడే ఈ కథ నా మనసులో మెదిలింది. బస్తీ లైఫ్‌ ఎలా ఉంటుంది. అక్కడ ఎవరు పేక మేడలు కడతారు అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం చేశాం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదురయ్యే కథ ఇది. ఇలాంటి కథ బయటకు వెళ్తే బజ్‌ క్రియేట్‌ అవుతుందని నమ్మి చేశాం.రాకేశ్‌గారు విన్న వెంటనే నిర్మాతగా ఓకే అన్నారు. అలాగే మంచి టీమ్‌ కుదిరింది. హీరోహీరోయిన్లు యాప్ట్‌ అయ్యారు.

వినోద్‌ మాట్లాడుతూ ‘‘పేక మేడలు’ చిత్రంలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. సెకెండ్‌ లాక్‌డౌన్‌లో నాకు వచ్చిన ఆఫర్‌ ఇది. సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన ఈ మెసేజ్‌ చూసి ఫేక్‌ అనుకున్నా. బట్‌ ప్రయత్నం చేశా. సినిమాలో భాగం అయ్యా. ఈ సిననిమా జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది. తెలుగు సినిమాలో నాన్‌ తెలుగు హీరోని తీసుకోవడం అంటే ఎంతో నమ్మకం ఉండాలి’’ అని అన్నారు.


హీరోయిన్‌ అనుష సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసి సినిమా సక్సెస్‌ కావాలని అభిలాషించారు.
తారాగణం: వినోద్ కిషన్, అనూష క్రిష్ణ
సాంకేతిక విభాగం :
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
రచన & దర్శకత్వం : నీలగిరి మామిళ్ళ
నిర్మాత : రాకేష్ వర్రే
సహా నిర్మాత: వరుణ్ బోర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేతన్ కుమార్
లైన్ ప్రొడ్యూసర్: అనూష బోర
డి ఓ పి: హరిచరణ్.కె
సంగీతం: స్మరన్
సౌండ్ డిసైనర్: రంగనాధ్ రేవి
సౌండ్ మిక్సింగ్: కన్నన్ గన్ పత్
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: సృజన అడుసుమిల్లి – హంజా అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: మేఘన శేషవపురి
స్క్రీన్ ప్లే : హంజా అలీ -శ్రీనివాస్ ఇట్టం-నీలగిరి మామిళ్ళ
డైలాగ్స్ & లిరిక్స్ : భార్గవ కార్తీక్
పీఆర్వో: మధు వి ఆర్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago