మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల’ 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్ కి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.
హిట్‌మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్‌ను అద్భుతంగా అందించిన సాంగ్ “మీసాల పిల్ల”. భీమ్స్ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్ ట్యూన్, బీట్‌లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా మారింది. తెలుగు పాటగా ఇంత పెద్ద స్థాయిలో పాన్-ఇండియా రీచ్ సాధించడం అరుదైన ఘనత.
మెగాస్టార్ చిరంజీవి తన సిగ్నేచర్ చార్మ్, ఎక్స్ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా నయనతారతో ఉన్న సీన్స్‌లో ఆయన టైమింగ్ ఫ్యాన్స్ ని అలరించింది. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ వోకల్స్ కట్టిపడేశాయి. ఆకట్టుకునే హుక్‌లైన్ తో ఈ సాంగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్‌గా మార్చేశాయి.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్ ఎక్కడ చూసినా “మీసాల పిల్ల” ఫీవర్‌నే కనిపిస్తోంది. అభిమానులు డాన్స్ చేస్తూ, రీమిక్స్‌లు చేస్తూ, తమ ప్రేమను అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు.
ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగతా సాంగ్స్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది.
సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా “షైన్ స్క్రీన్స్”, “గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్” బ్యానర్‌లపై నిర్మిస్తున్న “మన శంకరవర ప్రసాద్ గారు” 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…