‘సైక్ సిద్ధార్థ’ అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్‌టైనర్. ఫిల్మ్ మేకింగ్ చాలా కొత్తగా వుంటుంది. ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు
-నందు, వరుణ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి, స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ ‘సైక్ సిద్ధార్థ’ మ్యాడ్లీ హ్యూమరస్ టీజర్ రిలీజ్, డిసెంబర్ 12న ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్
యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. హీరో హైపర్యాక్టివ్,. ప్రతి చిన్న పరిస్థితికి అనూహ్యయంగా స్పందించే యువకుడు. టీజర్ ప్రారంభంలో, అతను తన స్నేహితుడితో కలిసి వైల్డ్ కారు ప్రయాణంలో, చిన్న చిన్న విషయాలపై తన నిరాశను చెబుతుంటాడు. విజయం సాధించడంలో నమ్మకం కోల్పోయిన ఓడిపోయిన వ్యక్తిగా తనను తాను చెప్పుకుంటాడు. టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది.
దర్శకుడు వరుణ్ రెడ్డి ఒక యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్టైనింగ్ చేశారు. నంద్ రగ్గడ్ లుక్, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ యాస , హైపర్యాక్టివ్ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. యూత్ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే పాత్రలో అదరగొట్టాడు.
ఈ చిత్రంలో యంగ్ ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. కె. ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఎమోషన్ ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది, స్మరన్ సాయి మ్యూజిక్ స్కోర్ ఫన్ ని ఎలివేట్ చేసింది. ప్రతీక్ నూతి ఎడిటర్. శ్రీ నందు ఎడిషనల్ స్క్రీన్‌ప్లేకు కూడా హెల్ప్ అయ్యింది, కథనానికి తన పర్శనల్ టచ్ ని జోడించింది.
ఈ టీజర్ హ్యాజ్ బజ్‌ను సృష్టిస్తుంది, డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. ఈ సినిమా, ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈ సినిమా మీ అందరికీ నచ్చి మా టీమ్ అందరు జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటున్నాను. ఒక ప్యాట్రన్ ని బ్రేక్ చేసి ఈ టీజర్ రిలీజ్ చేద్దాం అనుకున్నా. ము టీజర్ కట్ కొత్తగా ఉండాలని ప్రయత్నంతో చేశాం. మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఫన్ ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. సురేష్ బాబు గారు. రానా గారి దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ గ్రామర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన రానా గారికి సురేష్ బాబు గారికి థాంక్యూ. సినిమాని అన్నీ నేచురల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. చాలా మంచి సినిమా చేశాం. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలో చూడని ఒక కొత్త కోణం కనిపిస్తుంది. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ .. అందరికీ హాయ్. చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. సురేష్ బాబు గారు రానా గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ టైటిల్ కథకి పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రమోషన్స్ లో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాము. నందు చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. ఈ సినిమాతో తనలోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు.
యామిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్ ఫిలిం. మా టీమ్ అందరు చాలా నమ్మకంతో చేశాం. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. షూటింగ్ చాలా ఫన్ గా అనిపించింది. ఆడియన్స్ కూడా అదే ఫన్ ఫీల్ అవుతారు.
సాంకేతిక బృందం:
దర్శకత్వం: వరుణ్ రెడ్డి
ఎడిషనల్ స్క్రీన్‌ప్లే: శ్రీ నందు
నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి
సంగీతం: స్మరన్ సాయి
డిఓపి: కె ప్రకాష్ రెడ్డి
ఎడిటర్: ప్రతీక్ నూతి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ మక్కపాటి
సౌండ్ డిజైనర్లు: చతుర్వేది తిరునగరి, ఉదయ్ అప్పల
మిక్సింగ్ ఇంజనీర్: సంతోష్ వోడ్నాల
కలర్ గ్రేడింగ్: శ్రీ సారథి స్టూడియోస్
ప్రొడక్షన్ హౌస్: స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్
డిస్ట్రిబ్యూషన్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్
పీఆర్వో: వంశీ శేఖర్
టీజర్ ఎడిటర్: ప్రతీక్ నూతి
టీజర్ కలరిస్ట్: గణేష్ కొమ్మరపు
మార్కెటింగ్: స్పిరిట్ మీడియా
డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ: సౌత్ బె
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…