మనం చెప్పే ప్రతి అంశం సమాజంపై మంచి ప్రభావాన్ని చూపాలని ఆలోచించే స్టార్ మా మరోసారి తన సామాజిక బాధ్యతను నిరూపించుకుంది. సీరియల్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు విలక్షణమైన కథతో పాటు వ్యవస్థపై నమ్మకం, సంప్రదాయాల పట్ల గౌరవం, పోరాటతత్వం వంటి విలువలతో కూడుకున్నది ఉండేలా స్టార్ మా ముందు నుంచి అడుగులు వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్టార్ మాలో అందించిన పాత్రలుసాహసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, బాధ్యత, నిజాయతీ, కరుణ, దయ వంటి వాటిని మనకు చూపిస్తూ వచ్చాయి. వీటి కోవలోకి మరో కొత్త పాత్ర వచ్చి చేరబోతోంది. ఆ పాత్రే ‘భానుమతి’. మనం ఎగరాలని బలంగా అనుంటే రెక్కలు వాటంతట అవే వస్తాయని రుజువు చేసే అమ్మాయి కథే ఇది.
చదువే జీవితానికి వెలుగు చూపించే దీపం అని నమ్మే అమ్మాయే భానుమతి. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది ఆమె కల. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భానుమతి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది.. వాటిని ధైర్యంగా ఎలా అధిగమించిందో చెప్పే కథ ‘భానుమతి’. ఈ సరికొత్త ధారావాహిక మార్చి 10 నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.
తెలుగు సంప్రదాయాల ప్రకారం మన కుటుంబాల్లో ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తుంటాం. అందుకనే ‘భానుమతి’ కథకి ‘మా ఇంటి మాలక్ష్మి’ అనే ట్యాగ్ లైన్‌ను పెట్టారు. ఈ సీరియల్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం అవుతుంది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…