మన్మధరాజా ట్రైలర్ విడుదల

మాక్ కింగ్స్ క్రియేషన్స్ పతాకంపై రోషన్, పూజ డే, అమీక్ష పవర్ హీరో, హీరోయిన్స్ గా యం.డి. అభిద్ దర్శకత్వంలో  యం.డి. అహ్మద్ ఖాన్ నిర్మించిన  చిత్రం  “మన్మధరాజా”  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా  చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్  ఈవెంట్ గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ డి.యస్ పి లక్ష్మణ్ రావ్,  తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, యస్.యం. యస్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ దుబాయ్ వాజీద్, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో



మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ ఏ.యస్ పి లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ.. “మన్మధరాజా”  ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ ఇంతకు ముందు చేసిన సినిమాలు హిట్ అయినట్లే ఇప్పుడు వస్తున్న సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్, మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ కు యూత్ మెచ్చే సినిమాలు తీస్తున్నాడు. తను ఇంతకుముందు “ఓ మధు” అనే సినిమాలో వారి అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీసి సక్సెస్ అయ్యాడు.ఈ జనరేషన్ లో  విడుదలైన  “ఓ మధు” సినిమా 30 రోజుల థియేటర్స్ లలో ఆడడం అంటే ఆషామాషీ కాదు. తనకు సినిమా అంటే  ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆ సినిమా తరువాత “ఉత్తమ విలన్” సినిమా తీశాడు.అందులో తను విలన్ గా అద్భుతంగా నటించాడు. మళ్లీ ఇప్పుడు మన్మధరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తను ఈ ప్రెస్ మీట్ లో మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు  అనౌన్స్ చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.ఇలాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవసరం. వీరి వల్ల ట్యాలెంట్ ఉన్న నూతన దర్శకులు, టెక్నిషియన్స్ వంటి వారు ఇండస్ట్రీకి పరిచయ మవుతారు. అలాగే ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. అయితే తను  సినిమా తర్వాత  సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు చేయడమంటే ఆషామాషీ కాదు.. అలాగే మా అల్లుడు ఈ రోజు సినిమా ఆడెంట్ అనే హాస్పిటల్ ను ఓపెన్ చేయడం జరిగింది..అందులో ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ కు కార్డ్స్ ఇస్తాము. వాటి ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాము .దీనిని అందరూ ఉపయోగించు కోవాలని ఈ సభాముఖంగా తెలియ జేస్తున్నాను అని అన్నారు

చిత్ర  నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఫ్యాషన్. మా అబ్బాయి ని హీరోగా పెట్టి తీసిన  ఓ మధు  సినిమా 30 రోజులు ఆడేలా చేసిన  ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఉత్తమవిలన్  తరువాత చేసిన  మన్మధరాజా  సినిమా కూడా చాలా బాగా వచ్చింది.చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా తరువాత  నేను చేయబోయే  రెండు సినిమాలలో మా అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు. నేనే చేసిన, చేయబోయే  సినిమాల  ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది.నేను గతంలో షోషల్ ఎవెర్నెస్ ప్రోగ్రాం ఎన్నో చేశాను. ఇంకా చేస్తూనే ఉంటాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు అభిద్ మాట్లాడుతూ..మా ట్రైలర్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు  ధన్యవాదములు. నన్ను నమ్మి  ఇలాంటి మంచి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాత  యం.డి. అహ్మద్ ఖాన్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి.అయితే అందులో  రిలీజ్ అయ్యే సినిమాలు కొన్నే ఉంటాయి. కానీ ఇంత తక్కువ టైంలో తను తీసిన సినిమాలన్నీ రిలీజ్ చేయడమనేది  గ్రేట్. అలాగే ఇంతకుముందు ఖాన్ గారు చేసిన రెండు సినిమాలకు నేనే  మ్యూజిక్ ఇచ్చాను. ఇప్పుడు తను చేయబోయే రెండు సినిమాలకు కూడా నన్ను నమ్మి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు.

నటీ, నటులు
హీరో రోషన్, హీరోయిన్స్ పూజ డే, అమీక్ష పవర్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : మాక్ కింగ్స్ క్రియేషన్స్
నిర్మాత : యండి అహ్మద్ ఖాన్
దర్శకుడు : అబిద్
మ్యూజిక్ డైరెక్టర్ : త్రినాథ్

పి. ఆర్. ఓ : మధు వి.ఆర్

TFJA

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago