అల్లరి నరేష్, విజయ్ కనకమేడల’ఉగ్రం’ ఏప్రిల్ 14న విడుదల

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆ వీడియోలో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చాడం ఆసక్తికరంగా వుంది. వీడియో చివర్లో ఏప్రిల్ 14న విడుదల తేదీని ప్రకటించారు. నరేష్ తన తుపాకీని ఒకరిపై గురిపెట్టిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వీడియో, పోస్టర్ నరేష్ పాత్ర యొక్క వైల్డ్ క్యారెక్టర్ ని తెలియజేస్తున్నాయి.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. కొంతమంది ప్రముఖ నటీనటులు సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నాందికి పని చేసిన దాదాపు టెక్నికల్ టీం ‘ఉగ్రం’ కోసం పని చేస్తున్నారు.

తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు . శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: అల్లరి నరేష్, మిర్నా
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
కథ: తూము వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: సిద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago