మాక్ కింగ్స్ క్రియేషన్స్ పతాకంపై రోషన్, పూజ డే, అమీక్ష పవర్ హీరో, హీరోయిన్స్ గా యం.డి. అభిద్ దర్శకత్వంలో యం.డి. అహ్మద్ ఖాన్ నిర్మించిన చిత్రం “మన్మధరాజా” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ డి.యస్ పి లక్ష్మణ్ రావ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, యస్.యం. యస్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ దుబాయ్ వాజీద్, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ ఏ.యస్ పి లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ.. “మన్మధరాజా” ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ ఇంతకు ముందు చేసిన సినిమాలు హిట్ అయినట్లే ఇప్పుడు వస్తున్న సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్, మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ కు యూత్ మెచ్చే సినిమాలు తీస్తున్నాడు. తను ఇంతకుముందు “ఓ మధు” అనే సినిమాలో వారి అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీసి సక్సెస్ అయ్యాడు.ఈ జనరేషన్ లో విడుదలైన “ఓ మధు” సినిమా 30 రోజుల థియేటర్స్ లలో ఆడడం అంటే ఆషామాషీ కాదు. తనకు సినిమా అంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆ సినిమా తరువాత “ఉత్తమ విలన్” సినిమా తీశాడు.అందులో తను విలన్ గా అద్భుతంగా నటించాడు. మళ్లీ ఇప్పుడు మన్మధరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తను ఈ ప్రెస్ మీట్ లో మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు అనౌన్స్ చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.ఇలాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవసరం. వీరి వల్ల ట్యాలెంట్ ఉన్న నూతన దర్శకులు, టెక్నిషియన్స్ వంటి వారు ఇండస్ట్రీకి పరిచయ మవుతారు. అలాగే ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. అయితే తను సినిమా తర్వాత సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు చేయడమంటే ఆషామాషీ కాదు.. అలాగే మా అల్లుడు ఈ రోజు సినిమా ఆడెంట్ అనే హాస్పిటల్ ను ఓపెన్ చేయడం జరిగింది..అందులో ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ కు కార్డ్స్ ఇస్తాము. వాటి ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాము .దీనిని అందరూ ఉపయోగించు కోవాలని ఈ సభాముఖంగా తెలియ జేస్తున్నాను అని అన్నారు
చిత్ర నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఫ్యాషన్. మా అబ్బాయి ని హీరోగా పెట్టి తీసిన ఓ మధు సినిమా 30 రోజులు ఆడేలా చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఉత్తమవిలన్ తరువాత చేసిన మన్మధరాజా సినిమా కూడా చాలా బాగా వచ్చింది.చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా తరువాత నేను చేయబోయే రెండు సినిమాలలో మా అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు. నేనే చేసిన, చేయబోయే సినిమాల ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది.నేను గతంలో షోషల్ ఎవెర్నెస్ ప్రోగ్రాం ఎన్నో చేశాను. ఇంకా చేస్తూనే ఉంటాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు అభిద్ మాట్లాడుతూ..మా ట్రైలర్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. నన్ను నమ్మి ఇలాంటి మంచి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి.అయితే అందులో రిలీజ్ అయ్యే సినిమాలు కొన్నే ఉంటాయి. కానీ ఇంత తక్కువ టైంలో తను తీసిన సినిమాలన్నీ రిలీజ్ చేయడమనేది గ్రేట్. అలాగే ఇంతకుముందు ఖాన్ గారు చేసిన రెండు సినిమాలకు నేనే మ్యూజిక్ ఇచ్చాను. ఇప్పుడు తను చేయబోయే రెండు సినిమాలకు కూడా నన్ను నమ్మి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
నటీ, నటులు
హీరో రోషన్, హీరోయిన్స్ పూజ డే, అమీక్ష పవర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : మాక్ కింగ్స్ క్రియేషన్స్
నిర్మాత : యండి అహ్మద్ ఖాన్
దర్శకుడు : అబిద్
మ్యూజిక్ డైరెక్టర్ : త్రినాథ్
పి. ఆర్. ఓ : మధు వి.ఆర్
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…