అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. ఈ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో ‘వార్ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ దృశ్యాన్ని చూసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా వార్ 2 డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ కోసం డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ ‘వార్ 2’ YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో అడ్రినలిన్-పంపింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోన్నారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన "ఫూలే" సినిమా ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ…
24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్.. జనవరి 7న జరగనున్న ప్రీ-రిలీజ్…
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్…
శర్వానంద్ హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో సంయుక్త, సాక్షి…
మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల…