Categories: BOLLYWOOD

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ‘సయారా’ నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ ‘బర్బాద్’ విడుదల

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నేటి ట్రెండ్‌కి, యూత్‌ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

తాజాగా సయారా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘బర్బాద్’ అంటూ సాగే ఈ పాటను యంగ్ సెన్సేషణ్ జుబిన్ ఆలపించారు. ఈ పాటకు ది రిష్ సాహిత్యాన్ని అందించడమే కాకుండా బాణీని సమకూర్చారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ కోసం జుబిన్‌ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు మోహిత్ తెలిపారు.

ఈ మేరకు మోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రేమ పాటల్ని పాడేందుకు ప్రతీ తరంలో ఓ గాయకుడు పుట్టుకొస్తారు. ఈ తరానికి జుబిన్ అలాంటి ఓ గ్రేట్ సింగర్. సయారా ఆల్బమ్‌లో జుబిన్ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ పాడాలని నేను అనుకున్నాను. నేను బర్బాద్‌ ట్యూన్ విన్నప్పుడు జుబిన్ గాత్రం సరిగ్గా సరిపోతుందని భావించాను. జుబిన్ స్వరం చాలా ప్రత్యేకమైనది. జుబిన్ పాట పాడితే వాటికి లైఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయన గొంతులో ఇలాంటి రొమాంటిక్ లవ్ సాంగ్స్ ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఏ గాయకుడికైనా ఇది అరుదైన లక్షణం. అందుకే అలాంటి గాయకులు పెద్ద స్థాయికి వెళ్తుంటారు.

రొమాంటిక్ పాటలకు లోతైన భావం ఉంటుంది. అలాంటి పాటలకు గతంలోకి తీసుకు వెళ్లే శక్తి ఉంటుంది.. బర్బాద్ అలాంటి వారి జీవితాల్లో మళ్లీ ప్రేమను అనుభవించేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను. బర్బాద్ అనేది ప్రేమ, ప్రేమికుల గొప్పదనాన్ని చాటేలా ఉంటుంది. సయారా టైటిల్ ట్రాక్‌కి మాకు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత మళ్లీ ఇలా ‘బర్బాద్’ను తీసుకు వస్తున్నాం. ఈ పాటకి కూడా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామ’ని అన్నారు.

YRF హిస్టరీలో ఎన్నో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీలు ఉన్నాయి. ప్రధానంగా యష్ చోప్రా, ఆదిత్య చోప్రా కాంబోలో ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి అత్యంత ఇష్టమైన రొమాంటిక్ చిత్రాలను తీసిన మోహిత్ సూరి ఇప్పుడు ‘సయారా’తో రాబోతోన్నారు. ఈ చిత్రాన్ని అక్షయ్ విధాని నిర్మించారు. ఈ మూవీని జూలై 18న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

12 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago