థ్రిల్లింగ్ అనుభూతికి సిద్ధంగా ఉండండి! ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న తమిళ మర్డర్ మిస్టరీ యుగి నేటి నుంచి Aha OTTలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు వెర్షన్ కి ‘కార్తిక-మిస్సింగ్ కేస్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని భవాని మీడియా రిలీజ్ చేస్తుంది.
జాక్ హారిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గొప్ప స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను పూర్తిగా అలరించింది. కథిర్, నట్టి, ఆనందీ, నరైన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది.
కథలో, ఒక డిటెక్టివ్ తన బృందంతో కలిసి అదృశ్యమైన యువతిని వెతుకుతున్నాడు. దర్యాప్తులో కార్తిక అనే అమ్మాయి గురించి బయటపడే షాకింగ్ నిజాలు, అనూహ్య మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతాయి.
అద్భుతమైన నటన, తీవ్రమైన థ్రిల్, భావోద్వేగాల మేళవింపు ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్‌గా నిలబెట్టాయి.
ఈ వారం విడుదలయ్యే అత్యంత ఆసక్తికరమైన థ్రిల్లర్‌ను మిస్ అవకండి —కార్తిక-మిస్సింగ్ కేస్,నేటి నుంచి కేవలం Aha OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మీ వీకెండ్‌ను మిస్టరీ, థ్రిల్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేయండి.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…