YRF ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘వార్ 2’ కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Must Read

అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. ఈ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో ‘వార్ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ దృశ్యాన్ని చూసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా వార్ 2 డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ కోసం డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ  ‘వార్ 2’  YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో అడ్రినలిన్-పంపింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోన్నారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News