నైట్రో స్టార్ సుధీర్ బాబు, హర్షవర్ధన్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ‘మామా మశ్చీంద్ర’ అక్టోబర్ 6న విడుదల
నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయంతో అలరించబోతున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇందులో దుర్గ- స్థూలకాయుడు, పరశురాం- ఓల్డ్ డాన్, డిజె .. ఇలా మూడు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు సుధీర్ బాబు.
ఈ రోజు మేకర్స్ ‘మామా మశ్చీంద్ర’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో దుర్గ- ఓల్డ్ డాన్, డిజె.. ఈ మూడు లుక్స్ లో ఆకట్టుకున్నారు సుధీర్ బాబు.
ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమా పై క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ సింగిల్ గాలుల్లోన సంగీత ప్రియులను అలరించింది. విడుదల తేదీని లాక్ చేయడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను దూకుడుగా చేయనున్నారు.
ఈ చిత్రంలో మిర్నాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.
తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.
తారాగణం: సుధీర్ బాబు, మిర్నాళిని రవి, ఈషా రెబ్బా, హర్షవర్ధన్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి
సంగీతం: చైతన్ భరద్వాజ్
డీవోపీ: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
పీఆర్వో: వంశీ-శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…