సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మా నాన్న సూపర్ హీరో’ షూటింగ్ పూర్తి
సుధీర్ బాబు హీరోగా లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ కంటెంట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. CAM ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో షూటింగ్ పూర్తి అయిన సందర్భం గా చిత్ర యూనిట్ తో ఉన్న సెల్ఫీస్ ,వీడియో హీరో సుధీర్ బాబు తన సామజిక మాధ్యమం లో షేర్ చేశారు.
మా నాన్న సూపర్ హీరో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించనున్నారు.
ఫాదర్స్ డే సందర్భంగా మనసుని హత్తుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం తండ్రి కొడుకు మధ్య అనుబంధానికి నిజమైన అర్ధం చెబుతూ మనసుల్ని కదిలించే ఓ అద్భుతమైన ప్రయాణంగా ఉండబోతున్నట్టు టైటిల్ పోస్టర్ సూచిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ ముఖ్య తారాగణం.
సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్ కాగా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్.
దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరతో పాటు ఎంవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల ఈ చిత్రానికి రైటర్స్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అనౌన్స్ చేస్తారు.
తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ
సాంకేతిక విభాగం:
బ్యానర్: వి సెల్యులాయిడ్స్
అసోషియేషన్ : CAM ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత: సునీల్ బలుసు
డీవోపీ: సమీర్ కళ్యాణి
సంగీత దర్శకుడు: జై క్రిష్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కొరియోగ్రఫీ: రాజు సుందరం
రైటర్స్: ఎంవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…