విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ M4M (Motive For Murder) మూవీ

▪️ సరికొత్త సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మైన M4M చిత్రం
▪️ తెలుగుతో పాటు 5 భాషల్లో విడుద‌ల‌
▪️ హాలీవుడ్ రేంజ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్
▪️ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌క‌నిర్మాణం

తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫ‌రెంట్‌గా.. నా రూటు వేరు అన్నట్లు ఉంది. ఆ పోస్టర్ డిజైన్, M4M టైటిల్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా రేంజ్‌లో క‌నిపిస్తూ ఆ ఫీల్ కలుగుతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ప్రిన్సిపల్‌తో M4M (Motive For Murder) మూవీని తెర‌కెక్కించిన‌ట్టు చెప్పారు. స‌రికొత్త‌ సస్పెన్స్ థ్రిల్లర్ స‌బ్జెక్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీలో ఏ ఫెదర్ ఇన్ క్రౌన్ అవ్వ‌బోతోంద‌న్నారు. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ జోనర్లో ఇదొక కలికితురాయి నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లోనే M4M ను ఐదు భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయ‌బోతున్నామ‌న్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ ప‌వ‌న్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా ప‌నితనం.. వంటి త‌మ టీమ్ వ‌ర్క్‌ హాలీవుడ్ రేంజ్‌లో వ‌చ్చాయ‌ని ప్ర‌శంసించారు.

బ్యానర్: మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ USA.

తారాగణం:
జో శర్మ (ప్రధాన నటి) (USA), సంబీత్ ఆచార్య (ప్రధాన నటుడు).

సాంకేతిక సిబ్బంది:
కథ: మోహన్ వడ్లపట్ల, జో శర్మ, రాహుల్ అడబాల
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల
సంగీతం: వసంత్ ఇసాయిపెట్టై
DOP: సంతోష్ షానమోని
ఎడిటింగ్: పవన్ ఆనంద్, DI: డిజి క్వెస్ట్, VFX: పవన్, సౌండ్ డిజైనర్: సాగర్
దర్శకత్వ శాఖ: రాహుల్ అడబాల, హరి కిషన్, సుభాష్ సిరిపెల్లి
PRO: పర్వతనేని రాంబాబు, కడలి రామబాబు, దయ్యాల అశోక్

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

20 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

20 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

20 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago