నిర్మాత గా ఒక చరిత్ర సృష్టించిన ఎం.ఎస్. రాజు , దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ చిత్రం ‘అగధ’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14, 2026న భారీ స్థాయిలో విడుదల కానుంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆ మధ్య విడుదలైన ‘అగధ’ టీజర్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ వాతావరణం, గ్రాండియర్ మేకింగ్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. 14 మిలియన్ల మంది ఈ టీజర్ ని వీక్షించారంటేనే, ఎంతలా ప్రేక్షకుల్లోకి రీచ్ అయ్యిందో అర్థమవుతోంది.
‘అగధ’ గురించి దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ”‘అగధ’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. టీజర్‌లో చూసింది ఈ సినిమా ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే. సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇది ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్ వండర్‌లా అనిపించే సినిమా. అలాగే ఎమోషన్స్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పనిచేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. ప్రేక్షకులు థియేటర్లలో ఒక కొత్త అనుభూతిని పొందుతారు. మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఓ ఎమోషనల్ రోలర్ కోస్ట్ రైడ్ లా రూపొందిన ‘అగధ’ చిత్రం ఆగస్ట్ 14, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది” అని తెలిపారు.
నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, ”‘అగధ’ను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాం. టీజర్‌కు వచ్చిన స్పందన మా ఆనందాన్ని మరింత పెంచింది. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం” అన్నారు.
నటి కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, “మహాదేవి పాత్ర నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు.
హీరో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, ”‘డర్టీ హరి’ తర్వాత మళ్లీ ఎం.ఎస్. రాజు గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘అగధ’లో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి” అన్నారు.
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన – దర్శకత్వం: ఎం.ఎస్. రాజు,
సమర్పణ: అజయ్ కేఆర్,
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు,
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్,
సంగీతం: రాకేష్ వెంకటాపురం,
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి,
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ,
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్,
అదనపు స్క్రీన్‌ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal