ఆగస్టు 16, హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం 2026 – తెలంగాణ ఎడిషన్లో రాష్ట్రవ్యాప్తంగా 9,630 మంది గ్రామీణ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం, రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని 25 ప్రాంతాల్లో ఈశా గ్రామోత్సవాన్ని నిర్వహించారు, ఇందులో మొత్తం 843 జట్లు పాల్గొన్నాయి. వీటిలో 7,200 మంది ఆటగాళ్లతో కూడిన 600 పురుషుల వాలీబాల్ జట్లు, 2,430 మంది ఆటగాళ్లతో కూడిన 243 మహిళల త్రోబాల్ జట్లు ఉన్నాయి.
ఈ టోర్నమెంట్ డివిజనల్ రౌండ్ (స్టేట్ ఫైనల్) నేడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్లలో క్లస్టర్ స్థాయి మ్యాచ్లో విజయం సాధించిన 28 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఈ జట్లు స్టేట్ ఛాంపియన్షిప్ తో పాటు కోయంబత్తూరులో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో పోటీపడే అవకాశం కోసం ఇవాళ డివిజనల్ రౌండ్లో తలపడనున్నాయి. రాష్ట్రంలో గ్రామోత్సవం నిర్వహణ, పాల్గొనడం, క్రీడాకారుల ప్రతిభపై వివరాలను తెలియజేస్తూ రాష్ట్ర ఫైనల్ సందర్భంగా విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు.
విలేకరుల సమావేశంలో ఈశా బ్రహ్మచారి స్వామి అంబర మాట్లాడుతూ, “ఈ సంవత్సరం తెలంగాణ నలుమూలల నుండి 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులు ఈశా గ్రామోత్సవంలో పాల్గొన్నారు, వీరిలో దాదాపు 2,500 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ముందుకు వచ్చి పాల్గొనడానికి చూపిస్తున్న ఉత్సాహానికి ఈ సంఖ్యలే నిదర్శనం” అని అన్నారు.
“ఒక గ్రామం కలిసి ఆడినప్పుడు, గెలుపు వల్ల వచ్చే ఆనందాన్ని లేదా ఓటమి వల్ల కలిగే నిరాశను ఆటగాళ్లు మాత్రమే అనుభవించరు—ఆ ప్రయాణాన్ని గ్రామం మొత్తం పంచుకుంటుంది. ఇది వారిలో ఆత్మగౌరవం, ఐక్యత ఇంకా సమిష్టి భావనను పెంపొందిస్తుంది. గ్రామీణ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా క్రీడల ద్వారా ఇటువంటి భాగస్వామ్యం, సమైక్య భావన పెంపొందాలని, వికసించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే, గ్రామీణ భారతం శారీరకంగా చురుగ్గా, సామాజికంగా అనుసంధానమై, చురుకైన భాగస్వామ్యంతో ఉన్నప్పుడు, దాని ప్రభావం ఆట స్థలానికే పరిమితం కాకుండా చాలా దూరం వెళ్తుంది.”
విలేకరుల సమావేశం అనంతరం మహిళల త్రోబాల్, పురుషుల వాలీబాల్ రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలు జరిగాయి. మహిళల త్రోబాల్ పోటీలో గోయచల్క గ్రామానికి చెందిన ‘కొయచలక వారియర్స్’ జట్టు, పాపడ్పల్లికి చెందిన ‘పాపడ్పల్లి ఫైటర్స్’ జట్టుపై విజయం సాధించి రాష్ట్ర త్రోబాల్ ఛాంపియన్గా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన ‘రాణి రుద్రమదేవి’ జట్టు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ‘చింతల్ చెరువు’ జట్టు వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.
పురుషుల వాలీబాల్ పోటీలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ‘దేవుని పడకల్’ జట్టు, మహబూబ్నగర్ జిల్లా ‘మరికల్’ జట్టును ఓడించి రాష్ట్ర వాలీబాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన ‘గాడిపెద్దాపూర్’, నల్గొండ జిల్లాకు చెందిన ‘వెలుమినేడు బ్రదర్స్’ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
ఈ ఏడాది పాల్గొన్న వారిలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు విశిష్ట మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు — వారే 84 ఏళ్ల నరసమ్మ, 83 ఏళ్ల కోటమ్మ. ‘ఈశా గ్రామోత్సవం’ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కులుగా వీరు పాల్గొన్నారు. పల్లె ప్రజల్లో ఈశా గ్రామోత్సవం నింపుతున్న ఉత్సాహానికి నిదర్శనంగా తెలంగాణ నుంచి వరుసగా నాలుగో ఏడాది కూడా అత్యంత పెద్ద వయసు మహిళలు పాల్గొనడం విశేషం. అలాగే ఈశా గ్రామోత్సవం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. భద్రాద్రి కొత్తగూడెం లాంటి మారుమూల గ్రామాల్లో మ్యాచ్లు నిర్వహిస్తూ, పల్లె ప్రజలందరినీ ఒక్కటి చేస్తూ వారిలో క్రీడా ఉత్సాహాన్ని నింపింది.
గ్రామీణ అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహానికి అందిస్తున్న సేవలకు గానూ ఈశా గ్రామోత్సవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇది ‘ఫిట్ ఇండియా’ గుర్తింపు పొందడమే కాకుండా, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ‘నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్’ (NSPO)గా గుర్తింపు పొందింది. క్రీడలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో విశేష కృషి చేసినందుకు గాను 2018లో ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మక ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ లభించింది.
ప్రస్తుతం 18వ ఎడిషన్లోకి అడుగుపెట్టిన ఈ వేడుకను 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. క్రీడా స్ఫూర్తి, సామాజిక ఐక్యత, సాంస్కృతిక ఉత్సవాల ద్వారా భారత గ్రామాలను ఒకే తాటిపైకి తెస్తున్నారు. ఈ ఏడాది ఎడిషన్లో దేశవ్యాప్తంగా దాదాపు 7,000 జట్లు, 40,000 కంటే ఎక్కువ గ్రామాల నుంచి 80,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో దాదాపు 15,000 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈశా అవుట్డోచ్ తన ‘యాక్షన్ ఫర్ రూరల్ రెజువనేషన్’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్ మూడు దశల్లో జరుగుతుంది—క్లస్టర్ మ్యాచ్లు, డివిజనల్ రౌండ్లు మరియు గ్రాండ్ ఫినాలే. ఇందులో భాగంగా తెలంగాణ తన డివిజనల్ రౌండ్ను నేడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు.
ఈ సంవత్సరం, టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ ₹1 కోటికి పైగా ఉంది. డివిజనల్ రౌండ్ (స్టేట్ ఫైనల్) లో వాలీబాల్, త్రోబాల్ రెండింటిలోనూ విజేతగా నిలిచిన జట్లకు ₹15,000 చొప్పున, రన్నరప్లకు ₹10,000 లభిస్తాయి. మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా ₹6,000, ₹4,000 చొప్పున అందజేస్తారు. విజేతలకు సెప్టెంబర్ 4-6 తేదీల్లో కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ప్రసిద్ధ ఆదియోగి సమక్షంలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో పోటీపడే అవకాశం లభిస్తుంది. గ్రాండ్ ఫైనల్లో విజేత జట్లకు ఒక్కొక్కరికి ₹5 లక్షలు, రన్నరప్లకు ₹3 లక్షలు లభిస్తాయి. మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా ₹1 లక్ష, ₹50,000 చొప్పున అందజేస్తారు.
రాష్ట్రంలో ఈశా గ్రామోత్సవ నిర్వహణకు ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ’ (SATG) తమ సహకారాన్ని అందించింది. అలాగే ప్రైమ్ వాలీబాల్ లీగ్ కు చెందిన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ ఫ్రాంచైజీ కూడా ఈశా గ్రామోత్సవంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే, దేశవ్యాప్తంగా ఈశా గ్రామోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వామ్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీని ద్వారా వేలాది మంది గ్రామీణ క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని గుర్తించి, తమ గ్రామాలకు సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తూ, క్రీడల ద్వారా గ్రామీణ భారత స్ఫూర్తిని చాటుతున్నారు. ఈ 18వ ఎడిషన్కు ‘గ్రాఫ్టాన్ మోటార్స్’ మొబిలిటీ పార్టనర్గా, ‘నివియా స్పోర్ట్స్’ స్పోర్ట్స్ & ఎక్విప్మెంట్ పార్టనర్గా, ‘టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ బ్రాంజ్ పార్టనర్గా, ‘వండర్ సిమెంట్’ ఆన్-గ్రౌండ్ సపోర్ట్ పార్టనర్గా వ్యవహరిస్తున్నాయి.
పార్టనర్గా వ్యవహరిస్తున్నాయి. అలాగే ‘సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్’, ‘వరిందర కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్’, ‘రాయల్ ఇన్ఫ్రాకన్స్ట్రక్ట్ లిమిటెడ్’, మరియు ‘అగిలిసియమ్ కన్సల్టింగ్’ సంస్థలు సిఎస్ఆర్ (CSR) పార్టనర్స్ గా మద్దతు ఇస్తున్నాయి.
వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్…
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే…
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన…
‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః ’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఆస్కార్ అవార్డు…
క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం “డెలులు”. యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న “డెలులు” అనే పదాన్ని టైటిల్‌గా…
ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న…