“లగ్గం మూవీ జెన్యూన్ హిట్, ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు”

Must Read

రమేశ్ చెప్పాల దర్శకత్వంలో సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లగ్గం. మంచి కుటుంబ కథా చిత్రంగా పెళ్లి నేపథ్యంలో దర్శకుడు రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైన లగ్గం చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు,ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, రోహిణి , ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్రల్లో నటించారు. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…
లగ్గం చిత్రం జెన్యూన్ హిట్. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ ని రెండు రోజుల నుంచి గమనిస్తున్నా. ఈ క్రెడిట్ మొత్తాన్ని తన సోదరుడు లాంటి దర్శకుడు రమేష్ చెప్పాలకి ఇస్తాను.” అన్నారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఇంజనీర్ అల్లుడుగా కావాలని కోరుకోవడం అనేది సమకాలీన సమస్య! ప్రజెంట్ జనరేషన్ ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్ని ఆదరిస్తున్నారు” అని తెలిపారు. మీడియా మిత్రులు,క్రిటిక్స్ అంతా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి _మంచి ఫీల్ గుడ్ మూవీ’ అని చెబుతుంటే సంతోషంగా ఉంది.” అని రాజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. 

దర్శకుడు రమేశ్ చెప్పాల మాట్లాడుతూ లగ్గం చిత్రం కోసం తాను తొమ్మిది నెలల పాటు ప్రతి రోజు పద్దెనిమిది గంటలు కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో నాకు ఎంతో మద్దతుగా నిలిచిన చిత్ర యూనిట్, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది. అంటున్నారు ప్రేక్షక దేవుళ్లకు నా కృతజ్ఞతలు.

నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ
“లగ్గం సినిమాకు వస్తోన్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఎలాంటి అశ్లీలత లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నటీనటులకు ముఖ్యంగా డైరెక్టర్ రమేష్ చెప్పాల గారికి అభినందనలు.. ఒక మంచి సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, లగ్గం సినిమాను ప్రతి ఫ్యామిలీ తప్పకుండా చూడాలి, ఎమోషన్స్, బంధాలు, అనుబంధాలు ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగిందని” అన్నారు.

హీరో సాయిరోనక్ మాట్లాడుతూ “ఈ లగ్గం చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్ లో ఇది ఫస్ట్ మైల్ స్టోన్ మూవీ. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేశ్ చెప్పాల నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రచ్చ రవి కృష్ణుడు కిరీటి మాణిక్ రెడ్డి చరణ అర్జున్, బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంధ్య గంధం, వీవారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ చిత్రం విజయోత్సవ వేడుక లగ్గంలాగే ఘనంగా జరిగింది.

ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News