బీజేపీ నేత, నటి కుష్బూ సుందర్‌ను కేంద్ర మహిళా కమిషన్ మెంబర్‌గా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు మమత కుమారి, డెలినా కొంగ్డప్‌లను కూడా నియమించగా..

వీరు మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. దీనిపై కుష్బూ స్పందిస్తూ.. ‘ఇంతటి పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నారీ శక్తిని పరిరక్షించడానికి కృషి చేస్తాను’ అని ట్వీట్ చేశారు…