‘కబ్జ’ మూవీనుండి మూడో సాంగ్ రిలీజ్

Must Read

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజ‌ర్ విడుద‌లై ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ప్రేక్ష‌కులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ మూడో పాట‌గా ‘పల్లి పల్లి బెల్లం పల్లి..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తొలి పాటను హైదరాబాద్, రెండో పాటను చెన్నై గ్రాండ్ లెవల్లో విడుదల చేసిన మేకర్స్ మూడో పాటను దర్శకుడు, నిర్మాత ఆర్.చంద్రు త‌న హోం టౌన్ షిడ్ల గ‌ట్ట‌లో విడుద‌ల చేశారు. భారీ ఎత్తును ఈవెంట్‌ను నిర్వ‌హించి ఆడియెన్స్ స‌మ‌క్షంలోనే ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శాండిల్ వుడ్ కింగ్ శివ రాజ్‌కుమార్ చేతుల మీదుగా పాట విడుద‌లైంది. హెల్త్ మినిష్ట‌ర్ కె.సుధాక‌ర్, మాజీ మంత్రి హెచ్‌.ఎం.రెవ‌న్న‌, నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ఆనంద్ పండిట్‌,  కోప్రొడ్యూస‌ర్ అలంకార్ పాండియ‌న్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ప‌ల్లి ప‌ల్లి బెల్లంప‌ల్లి’ అంటూ సాగే ఈ పాట ప‌క్కా మాస్ సాంగ్‌. ఉపేంద్ర, తాన్యా హోప్ ఈ  పాట‌లో న‌ర్తించారు. కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌విబ‌స్రూర్ సంగ‌తం అందించిన ఈ పాట‌ను తెలుగులో చంద్ర‌బోస్ రాయ‌గా హ‌రిణి ఇవ్వ‌టూరి, సంతోష్ వెంకీ పాడారు. ఆనంద్ ఆడియోకి సంబంధించిన యూట్యూబ్ చానెల్‌లో ఈ లిరిక‌ల్ సాంగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

ఈ సంద‌ర్భంగా శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆర్.చంద్రు ఇది వ‌ర‌కే కొన్ని అద్భుత‌మైన చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో నేను కూడా భాగం కావ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మూవీ కూడా క‌చ్చితంగా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది’’ అన్నారు. స్టేజ్‌పై ఈ పాట‌కు ఆయ‌న త‌న స‌తీమ‌ణి గీతా శివ‌రాజ్‌కుమార్‌తో క‌లిసి స్టెప్పులేయ‌టం విశేషం.

హెల్త్ మినిష్ట‌ర్ కె.సుధాక‌ర్ మాట్లాడుతూ ‘‘గత ఏడాది నేను బెంగుళూరులో జ‌రిగిన రాజ‌మౌళిగారు డైరెక్ట్ చేసిన RRR సినిమా ఆడియోను విడుద‌ల చేశాను. అందులో పాట‌లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు క‌బ్జ పాట‌లు వాటి కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా అంతా క‌న్న‌డ సినిమాల‌ను చూస్తున్నాయి. క‌బ్జ మూవీ పాన్ ఇండియా లెవ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను’’అన్నారు.ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆర్‌.చంద్రు మాట్లాడుతూ ‘‘ఈవెంట్‌కు హాజ‌రైన అతిథుల‌కు, ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు. కబ్జ సినిమాకు, పాటలకు వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. ఫ్యాన్స్‌తో పాటు అభిమానులు కూడా క‌బ్జ సినిమా కోసం ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇండియా లెవ‌ల్లో 1800 థియేట‌ర్స్ లో విడుద‌ల చేయ‌బోతున్నాం’’ అన్నారు.

ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ రియ‌ల్ హీరో. మాస్, క్లాస్‌, మెలోడీల‌తో అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అలాగే ఆర్‌.చంద్రు ఈ సినిమాతో ఓ ఫెస్టివ‌ల్‌ను క్రియేట్ చేస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్రు ఎక్క‌డా క‌థ‌ను రివీల్ చేయ‌లేదు. అదే సినిమాకు మెయిన్ హైలైట్‌’’ అన్నారు.

శ్రియా శ‌ర‌న్.. ద‌ర్శ‌కుడు ఆర్.చంద్రుకి, టీమ్‌కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News