కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. “ ఒక్క మాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్ కి నిదర్శనం. నీ మొదటి సినిమాకే ఇలాంటి పాత్రను ఎంచుకోవడం చూస్తుంటే, అన్నింటికంటే కథపై నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. నీకు అద్భుతమైన ఆరంభం లభించాలని కోరుకుంటున్నాను బ్రదర్. @MusicThaman, #AnaswaraRajan, @itsmaheshuppala, @rajamahadhevan, @VenkyKudumula, చిత్ర బృందం మొత్తానికి నవంబర్ 13న విడుదల కానున్న మీ సినిమాకు నా శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు.
ట్రైలర్ పోలీసుల వేటతో ప్రారంభమవుతుంది. ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు అతడి కోసం పక్కా ప్లాన్ తో గాలిస్తుంటారు. ఈ విచారణలోకి అర్జున్ అనే మూగ యువకుడు ఎంటర్ అవుతాడు. అతను మాట్లాడలేకపోయినా, అసాధారణమైన తెలివితేటలు కలవాడని స్థానికులు చెబుతుంటారు. అద్భుతమైన తెలివితేటలతో పాటు, అర్జున్ మనసులో కీర్తిపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే, కొంతకాలానికే ఈ జంట ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. పోలీసులు, గూండాల ముఠా ఇద్దరి కోసం వేట మొదలుపెడతారు. ఒక మిస్టీరియస్ పెన్‌డ్రైవ్, ఏకంగా రూ.1,000 కోట్ల డీల్.. ఈ ఆసక్తికరమైన వేటకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.
దర్శకుడు మహేష్ ఉప్పల అన్ని కమర్షియల్ అంశాలను చక్కగా మేళవిస్తూ రొమాన్స్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్‌తో కూడిన ఆసక్తికరమైన లవ్ స్టోరీని థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. కథను చెప్పిన విధానం, ప్రజెంట్ చేసిన తీరు చూస్తే ఆయనకు కథనంపై ఉన్న పట్టును అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్జున్ అసలు గుర్తింపును ట్రైలర్లో రివీల్ చేయకుండా సస్పెన్స్‌ను కొనసాగించారు. అర్జున్ నిజంగానే దొంగనా? అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్న అమాయకుడా? లేక అతడి గతం వెనుక ఎవరూ ఊహించని రహస్యం ఏదైనా ఉందా? రూ.1,000 కోట్ల డీల్‌కు అర్జున్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న రహస్యాలేంటి? పోలీసులతో పాటు గూండాలు కూడా హీరో, హీరోయిన్ను వెంటాడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలను ప్రేక్షకుల ముందుంచింది.
హీరో అనీష్ తన నటనతో అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కొత్త హీరోలా ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా మూగ పాత్రలో నటించడం చాలా ఛాలెంజింగ్. మాటలు లేకుండా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తోనే భావోద్వేగాలను, ఆలోచనలను వ్యక్తపరచాలి. అలాంటి ఛాలెంజింగ్ పాత్రను అనీష్ ఎంతో అద్భుతంగా పోషించారు. స్టైలిష్ లుక్, ఎక్స్‌ప్రెసివ్ ఫేస్, ఇంప్రెసివ్ స్క్రీన్ ప్రెజెన్స్, సహజమైన నటనతో అద్భుమైనన కొత్త టాలెంట్‌గా ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ, ముఖ్యంగా హై ఎనర్జీ ఛేజింగ్ సన్నివేశాల్లోనూ ఎంతో ఈజ్‌తో నటించి, పెర్ఫార్మెన్స్తో పాటు యాక్షన్లోనూ ఆకట్టుకున్నారు
అనస్వర రాజన్ తన చార్మింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఆమె పాత్ర అమాయకంగా, క్యూట్‌గా కనిపిస్తూనే బలమైన భావోద్వేగాలను కూడా కలిగి ఉంది. అర్జున్ను ఎదురుదాడి చేయమని ప్రోత్సహించడం, తమ చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేయడం.. ఇలా తన సహజమైన క్యూట్‌నెస్‌ను కొనసాగిస్తూనే పాత్రలోని భావోద్వేగాలను చక్కగా పలికించారు. దీంతో ఆమె పాత్ర ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుంది.
రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ రొమాంటిక్ సన్నివేశాలను ఎంతో అందంగా చూపించడంతో పాటు, థ్రిల్లింగ్ సన్నివేశాలకు అవసరమైన ఇంటెన్స్ తీసుకొచ్చింది. ఎస్. థమన్ సంగీతం ప్రేమకథకు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కథనాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకులకు మంచి క్వాలిటీ ఎంటర్టైనర్ అందించాలనే మేకర్స్ నిబద్ధత ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది.
మొత్తంగా ఆసక్తికరమైన కథాంశం, ఫ్రెష్ లీడ్ పెయిర్, స్టైలిష్ యాక్షన్, సస్పెన్స్‌తో ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ అంచనాలను మించిపోయింది. రొమాన్స్, థ్రిల్స్, ఎమోషన్స్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపిన కంప్లీట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా అలరించనుంది. నవంబర్ 13న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.
జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్,…
థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన "కిల్లర్" సినిమా ఫ్యాన్సీ ప్రైస్ కు "కిల్లర్" సినిమా…
అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత…
ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా…
ప్రముఖ నటుడు నితిన్ నార్ణే ఇటీవల సినిమా షూటింగ్లో కుడి భుజానికి గాయమవడంతో, November 4న కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో…
రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి,…