రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మించిన చిత్రం ‘అ (AH)’. ఈ సినిమాకి సాయి బాలి దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. నవంబర్ 12న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
Trailer Link 🔗
https://youtu.be/08uVKulNDuw?si=9B8nAJHw5or6lux_
నందినీ రెడ్డి మాట్లాడుతూ .. ‘థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతుంటాయి. ‘అ (AH)’ చిత్రంతో దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల ప్రధాన బలం. అర్చనా అయ్యర్ ఈ సారి రాహుల్‌కి మంచి సక్సెస్ ఇవ్వాలి. నాకు రాహుల్ మంచి స్నేహితుడు. మేం ఇద్దరం కలిసి ఇది వరకే పని చేశాం. రాహుల్ చాలా మంచివాడు. అతడికి సినిమా తప్పా వేరే ఆలోచన ఉండదు. నవంబర్ 12న ‘అ (AH)’ చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయాలి’ అని అన్నారు.
ఆకాష్ పూరి మాట్లాడుతూ .. ‘రాహుల్ నాకు చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితుడు. ‘అ (AH)’ టీజర్, ట్రైలర్ బాగా నచ్చింది. శ్రీ చరణ్ మ్యూజిక్ అదిరిపోయింది. కెమెరా వర్క్ బాగుంది. అర్చనా గారి సక్సెస్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. చిన్నప్పుడే నేను రాహుల్ టాలెంట్ చూసి షాక్ అయ్యాను. రాహుల్ కష్టాన్ని దగ్గరుండి చూశాను. రాహుల్ ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాను. ‘అ (AH)’ చిత్రంతో రాహుల్‌కి మంచి విజయం దక్కాలి. నవంబర్ 12న ఈ సినిమా రాబోతోంది. తప్పకుండా చూడండి’ అని అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ లాంటి మంచి సినిమాల్ని ప్రమోట్ చేసేందుకు వచ్చిన నందినీ రెడ్డి గారికి, ఆకాష్ గారికి, శివానీ, శివాత్మిక గార్లకు థాంక్స్. శ్రీ చరణ్ బీజీఎం నాకు చాలా ఇష్టం. టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చిది. పోస్టర్ డిజైనింగ్, టైటిల్లోనే సినిమా కథను చెప్పడం బాగుంది. ఇండస్ట్రీలో ఇలాంటి నూతన దర్శక, నిర్మాతలు రావాలి. ‘శంబాల’తో అర్చన మంచి విజయాన్ని అందించింది. అదే సక్సెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. రాహుల్ చాలా మంచి వ్యక్తి. ఇందులో అతని స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే ‘ఈశ్వర్’లో ప్రభాస్‌లా కనిపించారు. నవంబర్ 12న ‘అ (AH)’ చిత్రం రాబోతోంది. ఈ సినిమాని అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ .. ‘రాహుల్ కోసమే ‘అ (AH)’ ప్రమోషన్స్‌కి వచ్చాను. ఈ చిత్రంలోని పాటలు నాకు చాలా నచ్చాయి. శ్రీ చరణ్‌తో మేం ‘గరుడవేగ’కి పని చేశాం. గ్యారీ గారు, సాయి గారు ఇలా అందరూ నాకు మంచి స్నేహితులు. ఈ సినిమా నవంబర్ 12న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ టీజర్, ట్రైలర్ చూశాం. నాకు చాలా నచ్చింది. విజువల్స్, బీజీఎం అన్నీ బాగున్నాయి. నాకు శ్రీ చరణ్ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సాయి గారి గురించి రాహుల్ ఎంతో గొప్పగా చెప్తుంటాడు. అర్చన, రాహుల్‌కి మంచి విజయం దక్కాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నవంబర్ 12న అందరూ థియేటర్లో సినిమాని చూడండి’ అని అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ డార్క్ క్రైమ్ జానర్లో ఉంటుంది. మీరు (ఆడియెన్స్) థియేటర్లో కూర్చున్న తర్వాత ఒక్క నిమిషం కూడా బోరింగ్‌గా అనిపించదు. సినిమా నవంబర్ 12న రాబోతోంది. మూవీ నచ్చితే ఓ పది మందికి చెప్పండి. కో ప్రొడ్యూసర్ అభినవ్ గారు మాకెంతో సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ సాయి గారు గోల్డ్ మెడలిస్ట్ అని నాకు ఈ మధ్యే తెలిసింది. అతనికి సినిమాలంటే పిచ్చి. ఈ చిత్రంతో ఆయనకు మంచి విజయం దక్కాలి. మా క్రియేటివ్ హెడ్ సంతోష్ గారికి థాంక్స్. శ్రీ చరణ్ గారి బీజీఎంతో మా సినిమా స్థాయి పెరిగింది. ఆయన బీజీఎం టాప్ నాచ్‌లో ఉంటుంది. ఈ కథ అంతా అర్చనా గారి చుట్టూనే తిరుగుతుంది. నా కోసం వచ్చిన నందినీ గారికి, వంశీ గారికి, ఆకాష్‌కి, శివానీ, శివాత్మికలకు థాంక్స్. నవంబర్ 12న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అర్చనా అయ్యర్ మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ప్రతీ అమ్మాయికి కనెక్ట్ అయ్యే కథ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హంట్ చేసేలా ఉంటుంది. శ్రీ చరణ్ గారితో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ బెస్ట్ ఇస్తుంటారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సాయి గారికి థాంక్స్. రాహుల్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నవంబర్ 12న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. శ్రీ చరణ్ అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. మోనిష్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిషేక్ గారు, సూర్య గారు, గ్యారీ, అభినవ్, సంతోష్ గారికి థాంక్స్. సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన రాహుల్ గారికి, అర్చనా గారికి థాంక్స్’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ టెక్నికల్‌గా బాగుంటుంది. మోనీష్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. అభినవ్, సంతోష్, సాయి ఇలా అందరూ నాకు మంచి ఫ్రెండ్స్. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. స్కోర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన రాహుల్, అర్చనకి థాంక్స్’ అని అన్నారు.
సహ నిర్మాత అభినవ్ కునపరెడ్డి మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు అద్భుతమైన స్కోర్ ఇచ్చిన శ్రీ చరణ్ గారికి, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన రాహుల్, అర్చనకి థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు: రాహుల్ విజయ్, అర్చన అయ్యర్, జాన్ విజయ్, సుధర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు
సాంకేతిక బృందం:
దర్శకుడు: సాయి బాలి
నిర్మాతలు: కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ BH
బ్యానర్లు: స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్
కో-ప్రొడ్యూసర్: అభినవ్ వి. కునపరెడ్డి
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
డీఓపీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటర్లు: అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH
డీఐ: సారథి స్టూడియోస్
వీఎఫ్ఎక్స్: జాయింట్ ఫ్యామిలీ ఫిల్మ్స్
పీఆర్వో: మడూరి మధు – ధీరజ్ -ప్రసాద్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్టా
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో అత్యంత ఘనంగా నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్…
సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో…
మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…
నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి.…
▪️ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి.. తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్…