“సమ్మర్ హాలిడేస్” పిల్లల సినిమా కాదు పిల్లలు నటించిన పెద్దల సినిమా, ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ – డైరెక్టర్ శ్రీకర్ నయన్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ నయన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ శ్రీకర్ నయన్.

  • మాది విశాఖ. కాలేజ్ డేస్ లోనే షార్ట్ ఫిలింస్ రూపొందించాను. అలా స్క్రిప్ట్, షార్ట్ ఫిలింస్ మేకింగ్ మీద ఆసక్తి పెరిగింది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి తెల్లవారితే గురువారం, మరికొన్ని చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాను. కొన్ని కథలు సిద్ధం చేసుకుని అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. మధుర శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ధీరజ్ మొగిలినేనిని కలిశాను. ఆయనకు ఒక థ్రిల్లర్ మూవీ కథ చెప్పాను. కథ ఆయనకు నచ్చింది. అయితే ఫిలింమేకింగ్ లో అనుభవం ఉంటే బాగుంటుంది మనం ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు అవకాశం ఇచ్చాయి కానీ అక్కడ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ పట్టేలా కనిపించింది. ఆ తర్వాత ధీరజ్ కు సమ్మర్ హాలీడేస్ కథ నచ్చి అవకాశం ఇచ్చారు. ఆయన ఓకే అన్నాక చకచకా కాస్టింగ్, టెక్నీషియన్స్ ఫైనల్ అవడం..ఇలా పనులన్నీ జరిగిపోయాయి.
  • ఫస్ట్ మా సినిమాకు అనుకున్న టైటిల్ సమ్మర్ ఫ్రెండ్. రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్న ఇద్దరు పిల్లలు సమ్మర్ లో స్నేహితులు అయితే ఎలా ఉంటుందనే పాయింట్ మీద ఈ కథను రెడీ చేశాను. మనం అమ్మమ్మ ఊరికి సమ్మర్ లో వెళ్లినప్పుడు ఎన్నో మెమొరీస్ ఉంటాయి. క్రికెట్ ఆడటం, తాటి ముంజలు తినడం, అమ్మమ్మ చెప్పే కబుర్లు వినడం, ఊరిలో కొత్త స్నేహాలు..ఇలాంటివి మనందరి జీవితాల్లో చూసి ఉంటాం. అవే ఈ కథకు స్ఫూర్తి. నా జీవితంలో జరిగిన ఘటనలు స్ఫూర్తి అని చెప్పలేను. మాది పిల్లల సినిమా కాదు పిల్లలు నటించిన పెద్దల సినిమా. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. మా సినిమాను థియేటర్ లో చూసి ఎక్సిపీరియన్స్ చేయాలి.
  • అరుణ్ అమ్మమ్మ పాత్రలో జయసుధ గారు నటించారు. ఆమెకు మా కుటుంబమంతా అభిమానులం. ఆమె అమ్మమ్మ పాత్ర అనగానే మొదటి సీన్ లోనే ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అరుణ్, జయసుధ గారి మధ్య వచ్చే సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆ సీన్స్ అన్నీ ప్రేక్షకులు హార్ట్ టచింగ్ గా ఫీలవుతారు. వాసుకి గారిది మంచి ఇంపార్టెంట్ రోల్. నేను ఈ కథ రాసినప్పుడు వాసుకి గారిని పాత్ర కోసం అనుకున్నాను. అలాంటి మంచి యాక్ట్రెస్ కు కీలకమైన పాత్రే ఇవ్వాలని అనిపించింది. మా మూవీలోని మెసేజ్, క్లైమాక్స్ లో స్ట్రాంగ్ డైలాగ్స్ కూడా ఆమెకే ఉంటాయి. హర్షిణి, రాజీవ్ కనకాల, హర్షవర్థన్ ఇలా ప్రతి ఒక్కరికీ మంచి రోల్స్ ఉన్నాయి. వాళ్ల పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.
  • ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ పెట్టాం. అరుణ్, రోహన్ లీడ్ రోల్స్, ఖుషిని మనశంకరవరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ చూసి తీసుకున్నాం. వందమంది పిల్లలు కూడా నటించారు. అరుణ్, రోహన్ ఇద్దరూ వెరీ టాలెంటెడ్. గోదావరి యాస కూడా నేర్చేసుకుని నటించారు. కానీ మిగతా వందమంది పిల్లలతో షూటింగ్ చేయడం అంత సులువుగా జరగలేదు. వాళ్లు ఒకరు ఉంటే మరొకరు దొరికేవారు కాదు ఎక్కడో ఆడుకునే వారు.
  • సమ్మర్ హాలిడేస్ సినిమా సమ్మర్ కు రిలీజై ఉంటే చాలా బాగుండేది. కానీ మాకు సమ్మర్ స్లాట్ దొరకలేదు. జూలైలో రిలీజ్ కు వద్దామని అనుకున్నా అప్పుడు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ ఉంది కాబట్టి ధీరజ్ వెయిట్ చేద్దామన్నారు. అలా డేట్ మారుతూ ఈ నెల 6న రిలీజ్ కుదిరింది. మనం ఈ మధ్య బ్లడ్ షెడ్, యాక్షన్ , వయలెంట్ మూవీస్ చూసి చూసి విసిగిపోయి ఉన్నాం. ఇలాంటి టైమ్ లో సమ్మర్ హాలీడేస్ మూవీ ప్లెజెంట్ ఎమోషన్స్ తో వెళ్తూ మన మొహం మీద చిన్న చిరునవ్వు తెప్పిస్తుంది. ఇలాంటి టైమ్ లో సమ్మర్ హాలీడేస్ వంటి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్లు కూడా ఈ తరహా సినిమా కోసం వేచి చూస్తున్నారు.
  • రోహన్ ఒక ప్రాబ్లమ్, అరుణ్ కు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. సమ్మర్ హాలీడేస్ లో వారి వారి సమస్యలను ఎలా డీల్ చేసుకున్నారు అనేది మా మూవీలో చూస్తారు. ఈ కథలో మేసేజ్ చెప్పేకంటే సత్యం సుందరం సినిమా లాంటి కథ చూపించాలని అనిపించింది. రోహన్, అరుణ్ పాత్రలు సత్యం, సుందరం పాత్రల్లా అనిపిస్తాయి. మా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అరుణ్ కు 35 ఇది చిన్న కథ కాదు సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ విషయం తెలిసినప్పుడు అరుణ్ తో పాటు మా టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం.
  • మా మూవీ సక్సెస్ పట్ల నేను, ధీరజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా సినిమాను ధీరజ్ తన క్లోజ్ సర్కిల్ కు చూపించారు. ప్రతి ఒక్కరూ బాగుందనే రెస్పాన్స్ ఇచ్చారు. ఈ దీపావళికి మా సమ్మర్ హాలీడేస్ మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం.
TFJA

Recent Posts

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు…

1 week ago

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు.. 2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి..!

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…

1 week ago

ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం..!

‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…

1 week ago

ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మ‌య‌స‌భ‌’ చరిత్ర!

57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…

1 week ago

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…

1 week ago

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

1 week ago