‘కల్కి 2989 AD’ – శాన్ డియాగో కామిక్-కాన్ లో ‘కల్కి 2989 AD’ స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ విడుదల

Must Read

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ టైటిల్ ‘కల్కి 2989 AD’ – శాన్ డియాగో కామిక్-కాన్ లో ‘కల్కి 2989 AD’ స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారి ప్రతిష్టాత్మకమైన చిత్రానికి అఫీషియల్ గా ‘కల్కి 2898 AD’ అని పేరుని ఖరారు చేసి అద్భుతమైన గ్లింప్స్ తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ సైన్స్ ఫిక్షన్, అపూర్వమైన స్టొరీ టెల్లింగ్ కలయికగా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో ‘కల్కి2898AD’ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సినిమా విజన్ కాన్సెప్ట్, స్పెల్‌బైండింగ్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. కొత్త టైటిల్ చిత్రం సారాంశాన్ని సంపూర్ణంగా సంగ్రహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికుల్లో  క్యురియాసిటీని, ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి2898AD ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. సినిమా 2898 AD ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. అద్భుతమైన కథాంశం, ఫ్యూచరిస్టిక్ అంశాల కలయికలో అసమానమైన, అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మాత సి అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు.

ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కామిక్-కాన్‌లో పాల్గొన్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా  కల్కి 2989 AD చరిత్ర సృష్టించింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ప్రభాస్‌, కమల్ హాసన్, తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత సి అశ్వనీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ చలసాని వేదికపైకి అడుగుపెట్టినప్పుడు ప్రేక్షకులు కరతాళధ్వనులతో ఘన స్వాగతం పలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇంత భారీ తారాగణం గురించి అడిగిన ప్రశ్నకు దర్శకుడు నాగ్ అశ్విన్ సమాధానం చెబుతూ, “ఒక అద్భుతమైన కథ చెప్పాలనే వారి ప్రేమ మా అందరినీ ఒకచోట చేర్చింది. నేను సైన్స్ ఫిక్షన్, పురాణాలను ఇష్టపడతాను. మహాభారతం, స్టార్ వార్స్ రెండింటి చూస్తూ వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక సినిమా చేయడం గొప్పగా అనిపించింది, అలా ‘కల్కి 2989 AD’ పుట్టింది’’ అన్నారు.

లైవ్ జూమ్ కాల్ ద్వారా ప్యానెల్ చర్చలో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు తన ఆనందం వ్యక్తం చేశారు. “ఈ చిత్రం కోసం నాగి నన్ను సంప్రదించినప్పుడు, గతంలో అతని అత్యుత్తమ పనితీరు నన్ను ఆకర్షించింది. ‘ప్రాజెక్ట్ K’ ఒక అసాధారణమైన, అద్భుతమైన అనుభవం. దీని వెనుక గొప్ప పరిశోధన ఉంది. షూటింగ్ సమయంలో నేను యూనిట్ తో కొన్ని అద్భుతమైన క్షణాలను పంచుకున్నాను. కామిక్-కాన్‌లో భాగం కావడం ఆనందంగా వుంది. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు ఏదైతే చూడబోతున్నారో ఖచ్చితంగా నచ్చితుందని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది మేము చిత్రాన్ని విడుదల చేసినప్పుడు మరింతగా ఇష్టపడతారు’’ అన్నారు  
అలాగే ” కామిక్-కాన్‌కి వెళ్తున్నామని నాగి నాకు చెప్పినప్పుడు, దిని ప్రాముఖ్యత నాకు తెలియదు. ఈ అవకాశం ఎంతగొప్పదో మా అబ్బాయి నాకు జ్ఞానోదయం చేశాడు”అని చెప్పారు బిగ్ బి.

కమల్ హాసన్ మాట్లాడుతూ “నేను ఇలాంటి సినిమాలుచేయడానికి ప్రయత్నించాను. ఐతే అవి చాలా చిన్నవి. ‘కల్కి 2989 AD’ కి పెద్ద విజన్ ఉంది. అందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నేను ట్రూపర్‌లను రూపొందించాలనుకున్నప్పుడు హాకీ మాస్క్‌లను కాస్ట్యూమ్ డిజైన్‌లో భాగంగా ఉపయోగించనట్లు గుర్తు. కానీ ‘కల్కి2989AD’ స్టయిల్ ని అద్భుతంగా చేసహ్రు. నాకు చాలా నచ్చింది’’ అన్నారు.

వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకులు, నిర్మాత సి అశ్వని దత్ తన కుమార్తెలు ప్రియాంక దత్ , స్వప్న దత్ చలసానితో కలసి ప్యానెల్‌ లో పాల్గొన్నారు. “నేను నా కెరీర్‌ని ఎన్‌టి రామారావు గారితో ప్రారంభించాను, అమిత్ జీ, కమల్ జీ, నా ఫ్రండ్ ప్రభాస్‌ని చేరుకోవడానికి 50 సంవత్సరాల కష్టపడ్డాను. ఇది మాకు చాలా గర్వకారణం.” అన్నారు అశ్వని దత్

శాన్ డియాగో కామిక్-కాన్‌లో “కల్కి 2989 AD” భారతీయ సినిమాకు ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది, ఇది భవిష్యత్తులో ప్రపంచ గుర్తింపుకు మార్గం సుగమం చేస్తోంది.

కల్కి 2898 AD చుట్టూ బజ్ పెరుగుతూనే ఉంది, మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మేము ఖచ్చితంగా చెప్పగల ఒక విషయం ఏమిటంటే.. వైజయంతీ మూవీస్ ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్‌తో స్టోరీ టెల్లింగ్‌ను పునర్నిర్వచించటానికి, ఇండియన్ సినిమా సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై చాటడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కానుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News