బేబీ టీమ్ కు అల్లు అర్జున్ కంగ్రాంట్స్

Must Read

టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ బేబీ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడం పట్ల సినిమా టీమ్ కృతజ్ఞతను, సంతోషాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ – ఈ సినిమా హిట్ అయినా కాకున్నా ఆర్టిస్టులుగా మాకు పేరొస్తుందని చెప్పారు మారుతి గారు. ఈ సినిమాకు థియేటర్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి నమ్మలేకపోయాం. మేము నటిస్తుంటే జనాలు ఇంతగా రియాక్ట్ అవుతారని ఊహించలేదు. ఇవాళ మా టీమ్ కు కంగ్రాట్స్ చెప్పేందుకు వచ్చిన అల్లు అర్జున్ గారికి థాంక్స్. అన్నారు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – అల్లు అర్జున్ గారి నటన అంటే ఇష్టం. ఆయన నాకొక ఇన్సిపిరేషన్. నేను ఇవాళ బాగా నటించానని పేరొచ్చిందంటే అందులో ఐకాన్ స్టార్ ఇచ్చిన స్ఫూర్తి కూడా ఉంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే పేరును బేబీ మార్చేసింది. ప్రయత్నిస్తే ఇక్కడి అమ్మాయిలు కూడా సక్సెస్ అందుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్ కృతజ్ఞతలు చెబుతున్నా. ఇంత వర్షంలోనూ బేబీ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయంటే మా సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ఊహించుకోవచ్చు. అని చెప్పింది.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – సాయిరాజేశ్ ఈ సినిమా కోసం నా దగ్గరకు వచ్చి 20 నిమిషాలు కథ చెప్పాడు. చేద్దామన్నా అని ఒప్పుకున్నా. అయితే ఇందులో 6 నిమిషాల పాట ఒకటి సింగిల్ టేక్ లో చేయాలి అన్నాడు. నాకు డ్యాన్సులు రావు సింగిల్ టేక్ సాంగ్ అంటున్నాడు అని భయపడ్డా. కొద్ది రోజుల పాటు అల్లు అర్జున్ అన్న పాటలు, డాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేశా. అలా మీరు మాకు ఇన్సిపిరేషన్ ఇస్తూనే ఉంటారు. నేను అనుకోకుండా నటుడిని అయ్యా. అయితే సినిమాలో మన క్యారెక్టర్ బాగా చేస్తే నటుడిగా గుర్తింపు వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. అల్లు అర్జున్ అన్న కూడా ఎన్ని ఆటంకాలు దాటి ఇంత పెద్ద స్టార్ అయ్యాడో మనకు తెలుసు. మా టీమ్ కు మీ విశెస్ ఎప్పుడూ కావాలి. అన్నారు

దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ – బేబీ సినిమా చూసి ఐకాన్ స్టార్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో మేము ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయాం. ఆయన ఒక కామన్ మాస్ ఆడియన్ ఎలా రియాక్ట్ అవుతాడో అలా రివ్యూ చెప్పాడు. అల్లు అర్జున్ గారు చెప్పింది పదే పదే గుర్తుచేసుకుంటూ మా హీరో హీరోయిన్స్ కు ఆ విషయాలన్నీ షేర్ చేసుకున్నా. ఆయన చెప్పింది వింటుంటే ఒక రాజమౌళి మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. మేము మీకు రుణపడి ఉంటాం అల్లు అర్జున్ అన్నా. మీరు ఇచ్చిన సపోర్ట్ తో బేబీ రేపటి నుంచి థియేటర్ లో మరింత హౌస్ ఫుల్ అవుతుంది. అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ప్రాణం సినిమా డిస్ట్రిబ్యూషన్ లో డబ్బులు పోగొట్టుకున్నప్పుడు బన్నీ పిలిచి మందలించాడు. ఆ తర్వాత ఆర్య సినిమా డిస్ట్రిబ్యూషన్ బన్నీ సజెషన్ మేరకే చేశాం. అలా బన్నీ వాసుకు, నాకు ఆ సినిమాలో లాభాలు వచ్చాయి. మా వాసు, నేను, యూవీ వంశీ కెరీర్ లు స్టార్టయ్యాయి. మా కెరీర్ కు అలా బన్నీ ఫిల్లర్ గా ఉన్నాడు. ఈరోజుల్లో సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చి ఎంకరేజ్ చేశాడు. అల్లు అర్జున్ లాంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్ లో ఏదైనా సాధించగలం. ఇంత పేరు, ఇమేజ్ ఉండి కూడా రోజుకు 18 గంటలు కష్టపడతాడు. ఆయనను చూసి ఎలా ఎదగాలో ఇన్ స్పైర్ అవమని మా పిల్లలకు చెబుతుంటా. ఇవాళ ఈ బేబీ సినిమా సక్సెస్ చూసి అతిథిగా వచ్చి ప్రోత్సాహం అందిస్తున్నారు. దీని వల్ల ఇలాంటి మంచి సినిమాలు చేసే ఇంకొంత మంది మేకర్స్ కు అల్లు అర్జున్ లా సపోర్ట్ దొరుకుతుందనే ఆశ ఏర్పడుతుంది. అన్నారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ – మా బన్నీనే మాకు అన్నీ. మా కెరీర్ బిగిన్ అయ్యిందే ఆయన సపోర్ట్ తో. నేను జర్నలిస్ట్ గా, పీఆర్వోగా పనిచేసి, ఈరోజుల్లో , బస్టాప్ చిత్రాలతో ప్రొడక్షన్ లోకి వచ్చాను. మా వాసు, మారుతితో కలిసి సినిమాలు చేస్తూ కో ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్నాను. అయితే నేను ఇండస్ట్రీలో ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం లేదు. ఈ బేబీ నాకు ఆ సమాధానం ఇచ్చింది. నాకే కాదు మా టీమ్ లోని చాలా మందికి లైఫ్ ఇచ్చింది. మా మూడేళ్ల కష్టానికి ఫలితం ఇచ్చింది. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు ఇల్లు కూడా అమ్మేశా. నేను ఈ సినిమాను నమ్మాను అంతే. ఇవాళ మా సినిమా అని అల్లు అర్జున్ రాలేదు. ఒక మంచి సినిమా ఎవరు చేసినా ఆయన సపోర్ట్ ఇస్తారు. అల్లు అర్జున్ గారు సినిమాను లవ్ చేస్తారు కాబట్టే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అని అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ – బేబీ సినిమా టోటల్ టీమ్ కు నా కంగ్రాంట్స్ చెబుతున్నా. సినిమాను చించేశారు. 7జీ బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి లాంటి కొన్ని సినిమాలే ప్రేమలోని బాధను తెలియజేస్తాయి. అలాంటి సినిమాలు తీయడం కష్టం. ఎందుకంటే అలాంటి లవ్ పెయిన్ చూపించే కథలు సులువుగా రావు. మన జీవితంలో చూస్తేనే, అనుభూతి చెందితేనే వస్తాయి. లైఫ్ నుంచి స్పూర్తి పొందితేనే బేబీ లాంటి సినిమా తీయగలం. ఒకరోజు బేబీ ఫస్ట్ హాఫ్, మరో రోజు సెకండాఫ్ చూశా. సినిమా పూర్తయ్యాక సిక్సర్ కొట్టారు అనిపించింది. ఈ సినిమా గురించి గంట సేపు చెప్పగలను. ఇందులో చాలా అంశాలు నచ్చాయి. సినిమా రాసిన విధానం, తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల పర్మార్మెన్సులు ఇలా ప్రతీది ఆకట్టుకుంది. వీళ్ల పర్మార్మెన్స్ చూసి షాక్ అయ్యాను. వారి నటనలో ఎంతో జెన్యూనిటీ ఉంది. చిన్నసినిమాలు థియేటర్ లో ప్రేక్షకులు చూడటం లేదు అనేది అబద్ధం. సినిమా బాగుంటే మీడియా, ప్రేక్షకులు నిజాయతీగా మద్దతు, ప్రేమ ఇస్తారు, అందుకు బేబీ సక్సెస్ నిదర్శనం. ఒక తల్లి బేబీని కనడానికి ఎంత కష్టపడుతుందో ఈ బేబీ సినిమా మేకింగ్ కోసం డైరెక్టర్ సాయిరాజేశ్ అంత కష్టపడ్డాడు. సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు, అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిరాజేశ్. కలర్ ఫొటో సినిమా చూసినప్పుడే అతను మంచి దర్శకుడు అనిపించింది. సాయిరాజేశ్ స్క్రిప్ట్ రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్..ఇలా అందరూ పాత్రల్లో జీవించారు. నాకు పర్సనల్ గా ఇలాంటి కథలు ఇష్టం. అందుకే బేబీ నచ్చిందేమో. ఈ సినిమా మీద ఆనంద్ పెట్టుకున్న నమ్మకమే ఈ సక్సెస్. విరాజ్ చాలా క్యూట్ గా ఉన్నాడు. చాలా బాగా డీసెంట్ నటించాడు. అవార్డుల ఫంక్షన్స్ లో మన హీరోయిన్స్ కనిపించక బాధనిపించేది. ఇవాళ మన తెలుగమ్మాయి వైష్ణవి హిట్ కొట్టడం సంతోషంగా ఉంది. అని చెప్పారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News