ఘనంగా ప్రారంభమైన ‘కలవరం’ సినిమా

విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరో మరియు ఇంకో హీరోయిన్లుగా సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, హనుమాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కలవరం. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి శశాంక్ కథని అందించగా సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ అలాగే మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండే వికాస్ బాడిస. నేడే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చదలవాడ శ్రీనివాసరావు గారు, సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. ఇది బాలచందర్, భాగ్య రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఉన్న సినిమా. ఇప్పటిదాకా చిన్న సినిమాలను పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ఇప్పుడున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైన చిన్న సినిమాలకు తోడ్పాటు కల్పించాలి. చిన్న సినిమాలకి షోలు ఎక్కువ ఇవ్వడం అదేవిధంగా మినీ థియేటర్లు కట్టి సపోర్ట్ ఇవ్వాలి. కలవరం టైటిల్ చాలా మంచి టైటిల్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి హీరో హీరోయిన్ల కి మూవీ టీంకి మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ : ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి సపోర్ట్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి గారు చెప్పడం జరిగింది. వెంటనే చెన్నై వెళ్లి హీరో కి కథ చెప్పాము. హీరో విజయ్ కనిష్క గారికి కూడా ఈ కథ చాలా నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాము అని అన్నారు. ఈ రోజున ఇలా గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. నన్ను నా కథని నమ్మి నాకే అవకాశం ఇచ్చిన శోభ రాణి గారికి హీరో విజయ్ కనిష్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ : మా నాన్నగారు విక్రమంగారు తమిళ్ లో ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి వంటి సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. నా మొదటి సినిమా హిట్ లిస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ తండ్రి పేరు నిలబెట్టారు నిలబెటవ్ అన్నారు. ఆ మాట నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఇప్పుడు ఈ కలవరం కథ విన్నాక అంతకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. శోభ గారు డైరెక్టర్ హనుమాన్ గారు మంచి ప్యాషన్ తో ఈ కథని నాకు వినిపించారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మంచి సినిమాలు కొత్త టాలెంట్ ఇంకా ఎంతోమంది మీ ముందుకు వస్తారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు.

కథ రచయిత శశాంక్ పి మాట్లాడుతూ : కథ వినగానే ఈ సినిమా మనం చేస్తున్నామని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ శోభారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను, డైరెక్టర్ హనుమాన్ కలిసే స్క్రిప్ట్ ని తయారు చేశాం. అదేవిధంగా కథ విన్న వెంటనే హీరో విజయ్ కనిష్క గారు ఈ సినిమాను ఒప్పుకుని ముందుకు వచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత శోభారాణి గారు మాట్లాడుతూ : కలవరం అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. విజయ్ కనిష్క కథ వినిన వెంటనే సినిమా మనం చేస్తున్నాము అని అన్నారు. శశాంక్ ఇచ్చిన కథ అలాగే డైరెక్టర్ హనుమాన్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డారు. అదే కష్టంతో ఇష్టంతో ఈ సినిమాని పూర్తి చేస్తాము. అడగగానే మా ఈ సినిమా ఓపెనింగ్ కి వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి మరియు సి కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు విడుదల చేస్తాము.ప్రేక్షకులు అందరూ మెచ్చే సినిమా అవుతుందని కచ్చితంగా చెప్తున్నాను అన్నారు.

నటీనటులు : విజయ్ కనిష్క(హిట్ లిస్ట్ ఫేమ్), గరిమ చౌహన్ , రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్)

టెక్నీషియన్స్ :
ప్రొడక్షన్ : సి ఎల్ ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
దర్శకత్వం : హనుమాన్ వసంశెట్టి
కథ : శశాంక్ పి
డి ఓ పి : వెంకటేష్
మ్యూజిక్ : వికాస్ బాడిస
ఎడిటర్ : శిరీష్ ప్రసాద్
పి ఆర్ ఓ : మధు విఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago