ప్రేక్షకులకు కామెడీ థ్రిల్లింత ఇవ్వనున్న కాజల్ అగర్వాల్…  

Must Read

అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘కోస్టి’. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా ‘గులేబకావళి’, జ్యోతిక ‘జాక్ పాట్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆయన ఆకట్టుకున్నారు.

హారర్ కామెడీగా ‘కోస్టి’ తెరకెక్కింది. ఇందులో తండ్రి కుమార్తె మధ్య అనుబంధాన్ని కూడా చూపించారు. కథ విషయానికి వస్తే, అనగనగా అందమైన లేడీ ఇన్‌స్పెక్టర్. ఆమె పేరు ఆరతి. గ్యాంగ్‌స్టర్ దాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అతడిని పట్టుకుని తీరుతానని శపథం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఆరతి తండ్రి దాసును అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. దాసును పట్టుకునే క్రమంలో అతడిని షూట్ చేయబోయి మరొకరిని షూట్ చేస్తుంది ఆరతి. ఆ తర్వాత ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

ఆరతి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు. గ్యాంగ్‌స్టర్ దాస్ రోల్ ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ చేశారు. ఆరతితో పాటు పని చేసే పోలీసులుగా సీనియర్ నటి ఊర్వశి, సత్యన్ కనిపించనున్నారు. పోలీస్ కథకు, దర్శకుడు కావాలని ప్రయత్నించే యోగిబాబు పాత్రకు సంబంధం ఏమిటి? మధ్యలో మానసిక వికలాంగులకు సంబంధించిన ఆస్పత్రికి యోగిబాబు ఎందుకు వెళ్లారు? అనేది ఆసక్తికరం. సినిమాలో రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని వంటి భారీ తారాగణం ఉంది. 

గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మాట్లాడుతూ ”హారర్ కామెడీ చిత్రమిది. ఇందులో హారర్, కామెడీతో పాటు థ్రిల్ ఇచ్చే అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఉలిక్కిపడి సన్నివేశాలు ఉన్నాయి. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రను కాజల్ అగర్వాల్ పోషించారు. అలాగే, అందంగానూ కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త కాజల్ కనపడతారు. ఊర్వశి, యోగిబాబు, కెఎస్ రవికుమార్, మనోబాల అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన యంగ్ తమిళ హీరో అతిథి పాత్రలో కనిపించారు. ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుంది. సామ్ సిఎస్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఉగాదికి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమిది. ఈ నెల 22న థియేటర్లలో విడుదల చేస్తున్నాం” అని చెప్పారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News