వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఆయన గట్టిగా నమ్ముతుంటారు. ఆ నమ్మకంతో ఆయన చేస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ అందరినీ ఆకట్టుకోవటంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. యూనిక్ సినిమాటిక్ ఎప్రోచ్, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమాను రూపొందించే డైరెక్టర్ పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు భాగం కావటంతో సినిమా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ ప్రముఖ బ్యానర్స్ మరో బ్రిలియంట్ టాలెంట్‌ను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు.
ఆకాశంలో ఒక తార చిత్రంతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సోమవారం రోజున మేకర్స్ ఆమె క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే..సరైన రోడ్లు కూడా లేని ఓ మారమూల పల్లె నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఆకాశంలో తారలను చేరుకోవాలంటూ కనే కలలను కథగా చూపించారు. దీనికి జీవీ ప్రకాష్ హృదయాలను హత్తుకునేలా బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు. సాత్వికను అందంగా చూపించారు. ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మెప్పించటానికి సిద్ధంగా ఉందని టీజర్ స్పష్టం చేస్తోంది.
సినిమాలో నటీనటులెవరనే విషయాలను ఇంకా పూర్తిగా చెప్పకపోయినప్పటికీ విడుదలైన గ్లింప్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె ప్రయాణంలోని నిశ్శబ్దమైన క్షణాలు, చివరల్లో దుల్కర్ తళుక్కున కనిపించటం.. వంటి విషయాలు చాలా భావాలను వ్యక్తం చేస్తున్నాయి. వైవిధ్యమైన, అర్థవంతమైన కథలను ఎంచుకునే దుల్కర్ సల్మాన్ అభిరుచికి తగ్గట్లు, డైరెక్టర్ పవన్ సాధినేని క్రియేటివిటీ కలిసి ఒక ప్రత్యేకమైన, గుర్తుండిపోయే సినిమాగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా రూపొందుతోంది.
విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే సినిమా సెన్సెటివ్ కథతో, బలమైన ఎమోషన్స్‌తో రూపొందుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా శ్వేత సాబుసిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా మంచి నటీనటులు, టెక్నీషియన్స్ కలయికతో రూపొందుతోన్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది.
నటీనటులు:
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: పవన్ సాధినేని
నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా
రచన : గంగరాజు గున్నం
సంగీతం: జి.వి.ప్రకాష్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్వేతా సాబు సిరిల్
Editor – KL Praveen
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…