‘నారాయణ అండ్ కో’ హీరో సుధాకర్ కోమాకుల ఇంటర్వ్యూ 

Must Read

‘నారాయణ అండ్ కో’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ : హీరో సుధాకర్ కోమాకుల  

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో హీరో సుధాకర్ కొమాకుల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ సినిమా కి హీరోతో పాటు నిర్మాతగా చేయడానికి కారణం ?
నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి వుంది. బిజినెస్ పరంగా కాదు కానీ ఏదైనా క్రియేటివ్ గా ప్రోడ్యుస్ చేయడం అంటే ఇష్టం.  మొదటి నుంచి వీడియోస్, కవర్ సాంగ్స్ చేస్తూనే వున్నాను. సినిమా నిర్మాణంలోకి రావలనుకున్నపుడు ఇది మంచి ఛాయిస్ అనిపించింది. దీనికంటే ముందు రీసెట్ అనే సినిమా మొదలుపెట్టాం. అది ఇంకా టేకాఫ్ కాలేదు. ఈలోగా ‘నారాయణ అండ్ కో’ వచ్చింది.

‘నారాయణ అండ్ కో’ లో మీకు నచ్చిన అంశం ఏమిటి ?
చిన్నా ఈ కథ చెబుతున్నపుడు చాలా గమ్మత్తుగా అనిపించింది. ఏం చేసిన ఫ్యామిలీ అంతా చేస్తారని చెప్పడం చాలా కొత్తగా హిలేరియస్ గా అనిపించింది. ఇది ఫ్యామిలీ మూవీ. ఇలాంటి సినిమాతో నిర్మాణంలోకి రావడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అంతా చాలా ఫన్ గా వుంటుంది. ఫ్యామిలీ అండ్ క్రైమ్ కామెడీ రెండూ వుంటాయి.

దేవి ప్రసాద్ గారి ఛాయిస్ ఎవరిది ?
ఈ కథ విన్న తర్వాత టైటిల్ అడిగాను. ‘నారాయణ అండ్ కో’ అని చెప్పారు. చాలా నచ్చింది. ఇందులో తండ్రి పాత్రకు ఎవరిని తీసుకోవాలని అలోచిస్తున్నప్పుడు దేవి ప్రసాద్ గారి పేరు చెప్పాను. ఆయన  సీరియస్ రోల్స్ చేసినా మంచి కామెడీ సినిమాలు తీశారు. అలాగే బయట ఆయన చాలా సరదాగా ఉంటారు.  ఈ పాత్రకు ఆయనైతే పర్ఫెక్ట్ అనిపించింది.

ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో  నారాయణ గారి అబ్బాయి పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చాలా సహజంగా సెటిల్డ్ గా వుంటుంది . నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు కామెడీ చాలా ఇష్టం. ఇందులో ఫుల్ లెంత్ వినోదం చేసే అవకాశం దక్కింది. చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో అమాయకత్వం నుంచే పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.

ఈ సినిమా కోసం చాలా విషయాలు కొత్తగా ప్రయత్నించాం. ఇందులో నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. అలాగే ఈ చిత్రానికి మహిళా ఎడిటర్ సృజన అడుసుమల్లి పని చేశారు. చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. దేవి ప్రసాద్, ఆమనీ గారు ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ చేశారు. ఇందులో చాలా ఫన్ తో కూడిన పాత్రలు చేశారు. అలాగే మా తమ్ముడు పాత్ర చేసిన జై కృష్ణ పాత్ర కూడా బాగుంటుంది. అలాగే పూజా కిరణ్ తెలుగమ్మాయి. ఆర్తి, సప్తగిరి, అందరూ చాలా చక్కగా నటించారు. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.

ఈ కథ కల్పితమా ? యధార్థ సంఘటనల స్ఫూర్తి ఉందా ?
ఈ కథ కల్పితమే. రవి గోలి రాశారు. ఆయన నాగ్ అశ్విన్ టీంలో పని చేశారు.

మీకు  రచనపై ఆసక్తి వుందా ?
సినిమా బాగా రావాలంటే ఏం చేయొచ్చు అనేది అలోచిస్తాను. మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చినపుడు అన్నిట్లో కొంచెం ప్రవేశం వుండాలి. మొదట కోరియోగ్రఫీ చేశాను. తర్వాత ఫోటోగ్రఫీ చేశాను. ఇలా కొన్ని క్రాఫ్ట్ ల పై అవగాహన వుంది. ఇందులో మాత్రం చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది.

ఈ జర్నీ లో రావాల్సినంత ఫేం వచ్చిందని అనుకుంటున్నారా ?
లేదండీ. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత మరో సోలో సినిమా పడుంటే నెక్స్ట్ లెవల్ లోకి వెళ్ళేది. ఐతే చేయాల్సిన కొన్ని ప్రాజెక్ట్స్ మొదలుకాలేదు. నేను మాత్రం ప్రయత్నిస్తూనే వున్నాను. ఏ  కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేసినా మొదటి సినిమాలానే ఫీలవుతున్నాను.

అనిల్ రావిపూడి సినిమాల్లో మిమల్ని అడగలేదా ?
అనిల్ మంచి ఫ్రండ్. తనకి నాకు మంచి పాత్ర ఇవ్వాలని వుంటుంది. అలాంటిది ఇంకా కుదరలేదు.

క్రాక్ తర్వాత అలాంటి పాత్రలు వచ్చాయా ?
వచ్చాయి కానీ నేనే ఆసక్తి చూపలేదు. లీడ్ రోల్స్ పైనే దృష్టి పెట్టాను. దర్శకత్వం పై ఆసక్తి వుంది ఐతే అది ఇప్పుడే కాదు. దానికి చాలా సమయం వుంది.

మీ డ్రీమ్ రోల్ ఏమిటి ?
నాకు బాక్సింగ్ యాక్షన్, డ్యాన్స్ నేపథ్యంలో వుండే సినిమాలు చేయాలని వుంది. అలాగే ఎమోషనల్ సినిమాలు కూడా ఇష్టం. త్వరలో ఒక ఎమోషనల్ రోల్ వున్న సినిమా చేస్తున్నాను.
అలాగే గుండెల్లో దమ్ము అనే సినిమా చేస్తున్నాను. అది ఫౌండ్ ఫుటేజ్ ఫార్మేట్ లో షూట్ చేశాం. 1980 నేపథ్యంలో ఒక లవ్ స్టొరీ కూడా వుంది. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.  

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News