గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ థియేటర్లలో నేచురల్ హైస్ ఇచ్చే పాత్ బ్రేకింగ్ చిత్రాలను నిర్మించడానికి ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నారు. ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ పై రూపొందనున్న సినిమాలకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి ప్రొడక్షన్ పార్ట్నర్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ, మరో సంచలనాత్మక చిత్రం ది ఢిల్లీ ఫైల్స్ నిర్మాణ భాగస్వామిగా వుంది. గతంలో కార్తికేయ 2 కోసం విజనరీ ప్రొడ్యూసర్‌గా ప్రశంసలు అందుకున్న అభిషేక్ అగర్వాల్‌తో కలిసి పని చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, గ్లోబల్ ఫోర్స్ గా పేరు పొంది, దేశం గర్వించేలా చేసిన రామ్ చరణ్‌తో చేతులు కలిపారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘ది ఇండియా హౌస్’. సాయి మంజ్రేకర్ హీరోయన్ గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తమ ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఇండియా హౌస్’ ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1905 బ్యాక్ డ్రాప్ లో లవ్, రెవెల్యుషన్ థీం ని ఎక్స్ ఫ్లోర్ చేసే ఈ పీరియడ్ డ్రామా కోర్ టీం సమక్షంలో హంపి (కిష్కింద)లోని విరూపాక్ష దేవాలయంలో గ్రాండ్ గా పూజా కార్యక్రమం జరిగింది.
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది.
టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పని చేస్తున్నారు. కెమరూన్ బ్రైసన్ డీవోపీ కాగా, విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్.
ఈ ఎపిక్ మూవీకి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్
సాంకేతిక సిబ్బంది:
ప్రెజెంటర్: రామ్ చరణ్
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , వి మెగా పిక్చర్స్
రచన, దర్శకత్వం: రామ్ వంశీకృష్ణ
సహ నిర్మాత: మయాంక్
డీవోపీ: కామెరాన్ బ్రైసన్
ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…