ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.
ఎవోల్ EVOL. (a love story in reverse ) డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో
దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ :
తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్, నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్‌గా. రూపొందిందని ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం అని అన్నారు.
నటీనటులు :
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్
టెక్నీషియన్స్ :
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్,
కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్,
ఎడిటర్: విజయ్,
కళ: యోగి వెలగపూడి,
కొరియోగ్రాఫర్: జిన్నా
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-నిర్మాత-దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి
పి ఆర్ ఓ : మధు VR
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…