టాలీవుడ్

‘బఘీర’లో వెరీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. రుక్మిణి వసంత్

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. పలు బ్లాక్‌బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రుక్మిణి వసంత్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘బఘీర’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు స్నేహ. తను ఓ డాక్టర్. ఇందులో చాలా ఇంపాక్ట్ ఫుల్ రోల్ ప్లే చేశాను. నా క్యారెక్టర్ ని డైరెక్టర్ సూరి గారు చాలా పర్టిక్యులర్ గా డిజైన్ చేశారు . ఎమోషనల్ సీన్స్ లో నా పెర్ఫార్మన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. లవ్ స్టోరీ, యాక్షన్ ఈ రెండు ట్రాక్స్ లోనూ ఎమోషన్ చాలా అద్భుతంగా ఉంటుంది.  

– జనరల్ గా యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ కి స్పేస్ ఉండదు అని చెప్తుంటారు. కానీ ఇందులో అలా కాదు. నా క్యారెక్టర్ కి చాలా ప్రిఫరెన్స్ ఉంది. ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కి చాలా వెయిట్ ఉన్న కథ ఇది.

ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ గారు కథ అందించారు కదా.. ఎలా ఉండబోతుంది ?
-ప్రశాంత్ నీల్ గారి పేరు చూడగానే ఆడియన్స్ లో కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. అయితే మా డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ..ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకు వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ లో వుండే ఎలిమెంట్స్ ఇందులో అద్భుతంగా కుదిరాయి. ప్రశాంత్ నీల్ గారి కథతో మా డైరెక్టర్ సూరి గారు తనదైన ఒక విజన్ క్రియేట్ చేశారు.

శ్రీమురళి గారితో వర్క్ చేయడం గురించి ?
-శ్రీమురళి వండర్ ఫుల్ కోస్టార్. బ్రిలియంట్ యాక్టర్. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంటుంది.

-అజినీస్ లోక్ నాథ్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అద్భుతంగా వుంటుంది. ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు.  

-హోంబలే ఫిలింస్ చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. చాలా సపోర్ట్ చేశారు.  

మీరు కథలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా?
– నిజానికి అలాంటి అవకాశాలు రావడం నా అదృష్టం. ఇప్పటి వరకు నా దగ్గరికి చాలా మంచి కథలు వచ్చాయి. చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సప్త సాగరాలు సినిమా తర్వాత నాకు చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. నేను అంత ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్లు చేయగలని ఫిలిం మేకర్స్ నమ్మకం ఉంచడం అదృష్టంగా భావిస్తున్నాను.

మీరు సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది?
– మా ఇంట్లో చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా అమ్మగారు ఎంతగానో ప్రోత్సహించారు.  మా అమ్మగారికి కళల పట్ల మంచి అభిప్రాయం ఉంది. నా థియేటర్ జర్నీ మా మదర్ తోనే స్టార్ట్ అయింది.  మై మదర్ ఈజ్ మై సపోర్ట్ సిస్టం. నా కెరియర్ స్టార్టింగ్ లో అన్ని స్క్రీన్ టెస్ట్లకి మా అమ్మగారే వచ్చేవారు. ఒకసారి లండన్ కూడా తీసుకెళ్లారు. ఫ్యామిలీ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది.

దీపావళికి మొత్తం నాలుగు సినిమాలు వస్తున్నాయి.. ఎలా అనిపిస్తుంది?
దీపావళికి ఇది నా ఫస్ట్ రిలీజ్.  చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడు వరకు సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  టీజర్ ట్రైలర్ పాటలు  చాలా మంచి బజ్ క్రియేట్ చేశాయి. తప్పకుండా ఆడియన్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది.

మీకు దీపావళి క్రాకర్స్ లో ఏది ఇష్టం?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ దీపం తో పోల్చవచ్చు. పర్సనల్ గా అయితే నాకు రాకెట్ ఇష్టం(నవ్వుతూ). దీపావళి రోజున ఇంట్లో ఫ్యామిలీ అందరితో కలిసి గడపడం నాకు చాలా ఇష్టం.

కొత్తగా చేయబోయే సినిమాల గురించి ?
ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో వున్నాయి. త్వరలోనే చెబుతాను.

ఆల్ ది బెస్ట్.. హ్యాపీ దీపావళి
-థాంక్ యూ

Tfja Team

Recent Posts

తండేల్ ట్రైలర్ ఫెంటాస్టిక్ గా వుంది. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి సూపర్ స్టార్ అమీర్ ఖాన్

-‘తండేల్’ లాంటి గొప్ప సినిమాలో పార్ట్ కావడం నా అదృష్టం: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య యువ సామ్రాట్ అక్కినేని…

15 hours ago

This opportunity comes once in a lifetime – Vicky Kaushal

"There is a divinity in the film ‘Chhaava’ - Rashmika Mandanna at the press meet…

16 hours ago

జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది.. ‘ఛావా’ ప్రెస్ మీట్‌లో విక్కీ కౌశల్

‘ఛావా’ చిత్రంలో ఓ దైవత్వం ఉంటుంది.. ప్రెస్ మీట్‌లో రష్మిక మందన్న విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో…

16 hours ago

ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘గోల్డెన్ స్పారో’ విడుదల..

మల్టీటాలెంటెడ్ ధనుష్ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ పరిశ్రమపై తన ముద్ర వేస్తూనే ఉన్నారు.…

19 hours ago

Dhanush Directorial Jaabilamma Neeku Antha Kopama First Single out now

Versatile actor Dhanush has left a significant mark on the entertainment industry. And after delivering…

19 hours ago

RGV ‘శారీ’ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘ఎగిరే గువ్వలాగ’ రిలీజ్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ' లాగ్ లైన్: 'టూ మచ్ లవ్ కెన్ బి…

19 hours ago